Advertisement
Advertisement
Abn logo
Advertisement

మణిపాల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ హెల్త్’

విజయవాడ: నగరంలోని మణిపాల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం రన్ ఫర్ హెల్త్ కార్యక్రమం జరిగింది. అమరావతి రన్నర్స్, రెడ్ ఎఫ్ఎం, డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో మణిపాల్ ఆసుపత్రి నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏపీ ఏడీజీపీ(లా అండ్ ఆర్డర్) డా. రవిశంకర్ అయ్యనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మణిపాల్ హాస్పిటల్స్ 15వ వార్షికోత్సవం సందర్భంగా సమాజంలో ఆరోగ్యంపై అవగాహనను మెరుగుపరిచేందుకు ‘రన్ ఫర్ హెల్త్’ పేరుతో 5కే, 10కే రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవిశంకర్ అయ్యనార్ మాట్లాడుతూ “ఇక్కడ ఉత్సాహభరితమైన వాతావరణాన్ని చూస్తుంటే నాకు కన్నుల పండుగగా ఉంది. ఈ రన్ ద్వారా ఆరోగ్యంగా ఉండటం అలాగే ఫిట్‌గా ఉండటం ఎంతో ముఖ్యమో తెలియజేస్తున్నారు. ఈ రన్‌లో అమరావతి రన్నర్స్‌ తో పాటు అనేక వాకర్స్ క్లబ్‌లు పాల్గొనడం ఎంతో ఆనందంగా వుంది. రన్‌లో పాల్గొనే వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు” అని అన్నారు.

మణిపాల్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ ‘‘మా హాస్పిటల్ 15వ వార్షికోత్సవ సందర్భంగా రోగి సంరక్షణ, సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాము. అలాగే మానసికంగా, శారీరకంగా వారి ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాము.” అని అన్నారు. ఈ రన్‌లో విజేతలుగా నిలిచిన వారికి కృష్ణా జిల్లా కలెక్టర్ జే నివాస్ బహుమతులు ప్రదానం చేశారు.

Advertisement
Advertisement