వీరిద్దరూ పోటీపడింది ‘నోటా’తోనా!

ABN , First Publish Date - 2021-05-05T14:36:18+05:30 IST

తమిళ రాజకీయాలకు, సినీరంగానికి అవినాభావ సంబంధం ఉంది. సినీరంగంలో వెలుగొందిన కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత, శివాజీగణేశన్‌,విజయకాంత్‌ సహా పలువురు రాజకీయాల్లో

వీరిద్దరూ పోటీపడింది ‘నోటా’తోనా!


పెరంబూర్‌(చెన్నై): తమిళ రాజకీయాలకు, సినీరంగానికి అవినాభావ సంబంధం ఉంది. సినీరంగంలో వెలుగొందిన కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత, శివాజీగణేశన్‌,విజయకాంత్‌ సహా పలువురు రాజకీయాల్లో కూడా రాణించారు. వారిని ఆదర్శంగా తీసుకొని మరికొందరు రాజకీయాల్లో ప్రవేశించి నా కొద్దిరోజుల్లోనే కనుమరుగవుతున్నారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో కూడా పలువురు నటీనటులు పోటీచేయగా, సీమాన్‌, కమల్‌హాసన్‌లు పార్టీలు ప్రారంభించి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో, తిరువొత్తియూర్‌లో పోటీచేసిన సీమాన్‌ 48,597ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. అలాగే, కోవై దక్షిణంలో పోటీచేసిన కమల్‌హాసన్‌ 1,728 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. ఇక, ఈ ఎన్నికల్లో పోటీచేసిన హాస్యనటులు మయిల్‌స్వామి, మన్సూర్‌ అలిఖాన్‌ రాజకీయాల్లో కూడా హాస్యం పండించారు. వారు పొందిన ఓట్లు పరిశీలిస్తే, విరుగంబాక్కంలో పోటీచేసిన మయిల్‌స్వామికి 1,440 ఓట్లు దక్కగా, ‘నోటా’కు మాత్రం 1,563 ఓట్లు వచ్చాయి. అలాగే, తొండాముత్తూర్‌లో పోటీచేసిన మన్సూర్‌ అలీఖాన్‌కు 428 ఓట్లు రాగా, ‘నోటా’కు 1,622 ఓట్లు వచ్చాయి.

Updated Date - 2021-05-05T14:36:18+05:30 IST