తల్లిపాలతో ఆభరణాల తయారీ.. మహిళల నుంచి వెల్లువెత్తుతున్న ఆర్డర్లు.. ఎక్కడో తెలుసా..

ABN , First Publish Date - 2021-12-30T00:36:06+05:30 IST

తల్లి పాలతో ఆభరణాలు కూడా తయారు చేస్తారని చాలా మందికి తెలీదు. బిడ్డకు పాలు ఇచ్చిన రోజులు జీవితాంతం గుర్తుండేలా.. ఆ పాలతో చేసిన ఆభరణాలను తల్లులు ధరిస్తున్నారు...

తల్లిపాలతో ఆభరణాల తయారీ.. మహిళల నుంచి వెల్లువెత్తుతున్న ఆర్డర్లు.. ఎక్కడో తెలుసా..

తల్లి పాలు బిడ్డకు శ్రేష్ఠం.. అనే విషయం అందరికీ తెలిసిందే. తల్లి పాలలో సుమారు 400 పైచిలుకు పోషకాలు ఉంటాయని, అందుకే, అప్పుడే పుట్టిన బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకూ.. కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే తల్లి పాలతో ఆభరణాలు కూడా తయారు చేస్తారని చాలా మందికి తెలీదు. బిడ్డకు పాలు ఇచ్చిన రోజులు జీవితాంతం గుర్తుండేలా.. ఆ పాలతో చేసిన ఆభరణాలను తల్లులు ధరిస్తున్నారు.  యూఎస్‌కు చెందిన ఓ మహిళ.. తన పాపకు పాలు ఇచ్చిన జ్ఞాపకాలు చిరకాలం గుర్తుండేలా.. తన పాలతో ఉంగరం చేయించుకుంది. వివరాల్లోకి వెళితే..


యూఎస్‌కి చెందిన అల్మా పార్టిడా అనే మహిళకు కుమార్తె ఉంది. తన కూతురుకు పాలు ఇచ్చిన రోజులు, మాతృత్వపు మాధుర్యాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలని రోజూ ఆలోచించేది. అయితే ఆ రోజులు గుర్తుండడం కోసం వివిధ మార్గాలను అన్వేషించింది. తన కుమార్తె అలెస్సాకు సుమారు 18 నెలల పాటు పాలిచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె ఓ వార్త చూసింది. తల్లిపాలతో నగలు తయారు చేసే కంపెనీ ఉందని తెలిసింది. వెంటనే వారిని సంప్రదించింది. తనకు ఓ అందమైన ఉంగరం కావాలంటూ ఆర్డర్ పెట్టింది.

ముహూర్తాలు లేవని ఫిబ్రవరి 21న పెళ్లి ఫిక్స్.. కానీ వరుడితో విసిగి ఈ యువతి నిర్ణయమిదీ..!


అందుకోసం ఆమె పాలలో సుమారు 10 మిల్లీలీటర్లను కీప్‌సేక్స్ బై గ్రేస్ అనే కంపెనీకి పంపించింది. నెల తర్వాత ఆ కంపెనీ యాజమాన్యం.. ఆమెకు అందంగా డిజైన్ చేయబడిన ఉంగరాన్ని పంపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలతో ఆభరణాలు చేయడమేంటీ.. అంటూ అంతా తనను హేలన చేశారని గుర్తు చేసుకుంది. అయితే తన ఆభరణం చూసిన తర్వాత చాలా మంది.. తమకు కూడా కావాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేసింది. బిడ్డకు పాలు పట్టే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే చాలా మంది మహిళల నంచి ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. ఆమె ఉంగరాన్ని చూపిస్తూ ఉన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ స్టోన్ విలువ రూ.4 వేల నుంచి రూ.11 వేల వరకు ఉన్నా.. మహిళలు లెక్కచేయడం లేదు.

పెళ్లి మండపంపై సిద్ధంగా ఉన్న వధువు.. ఇక వరుడు రావడమే ఆలస్యం... అయితే అందుకు విరుద్ధంగా..



Updated Date - 2021-12-30T00:36:06+05:30 IST