ఉక్కు సీఎండీకి పలువురు అభినందనలు

ABN , First Publish Date - 2021-09-19T05:28:17+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన అతుల్‌భట్‌ను టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్‌బాబులు శనివారం కలిసి అభినందనలు తెలిపారు.

ఉక్కు సీఎండీకి పలువురు అభినందనలు
ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌కు అభినందనలు తెలుపుతున్న టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

ఉక్కుటౌన్‌షిప్‌, సెప్టెంబరు 18: స్టీల్‌ప్లాంట్‌ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన అతుల్‌భట్‌ను టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్‌బాబులు శనివారం కలిసి అభినందనలు తెలిపారు. ప్లాంట్‌ ప్రగతికి పూర్తిగా సహకరిస్తామని, ఉక్కు నిర్వాసితులకు న్యాయం చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో నమ్మి సింహాద్రి, పొట్ల శ్రీను, గుమ్మడి నరేంద్ర, పల్లా పెంటారావు, గంతకోరు అప్పారావు పాల్గొన్నారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ నేతృత్వంలో నాయకులు మసేన్‌రావు, డొక్కా నరసింగరావు, నరేశ్‌కుమార్‌, రాజుబాబు, యెల్లేటి శ్రీనివాసరావులు సీఎండీని కలసి అభినందించారు.


Updated Date - 2021-09-19T05:28:17+05:30 IST