Marina Beach‌లో స్నానాలకు నిషేధం

ABN , First Publish Date - 2021-10-18T17:39:42+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన రాష్ట్రప్రభుత్వం స్థానిక మెరీనా బీచ్‌ను సందర్శించేందుకు అనుమతి జారీచేయడంతో సెలవు రోజైన ఆదివారం పెద్దసంఖ్యలో సందర్శకులు గుమిగూడారు. అయితే అక్కడ భద్రతా విధుల్లో పాల్గొన్న

Marina Beach‌లో స్నానాలకు నిషేధం

చెన్నై/ప్యారీస్: కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన రాష్ట్రప్రభుత్వం స్థానిక మెరీనా బీచ్‌ను సందర్శించేందుకు అనుమతి జారీచేయడంతో సెలవు రోజైన ఆదివారం పెద్దసంఖ్యలో సందర్శకులు గుమిగూడారు. అయితే అక్కడ భద్రతా విధుల్లో పాల్గొన్న పోలీసులు, సముద్రంలో దిగి స్నానాలు చేసేందుకు యత్నించిన వారిని అడ్డుకొని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధిల సమాధుల నుంచి మైలాపూర్‌ లైట్‌ హౌస్‌ ప్రాంతం వరకు సముద్రతీరంలో పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు నిబంధనలు అతిక్రమంచి స్నానం చేసేందుకు యత్నించిన యువకులను అడ్డుకొనేందుకు బ్యాటరీ వాహనంలో పోలీసులు పర్యవేక్షించారు. మెరీనాలో స్నానం చేస్తూ నీటమునిగి మరణించే వారిని అడ్డుకొనేందుకు ఆ ప్రాంతంలో ఓ కంట్రోల్‌ రూమ్‌, అగ్నిమాపకశాఖ వాహనం, గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. అంతేకాకుండా డ్రోన్ల ద్వారా సముద్రతీర ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు లౌడ్‌స్పీకర్ల ద్వారా సముద్రంలో దిగి స్నానం చేయరాదని సందర్శకులను పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-10-18T17:39:42+05:30 IST