చీపురుపల్లి: మండలంలో ని విజయరాంపురం గ్రామానికి చెందిన శనపతి రమణ మ్మ (40) గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్య కు పాల్పడింది. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు మృతురాలి కుమారుడు రాజేష్ పోలీసులకు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేస్తున్నట్టు హెచ్‌సీ లక్ష్మయ్య చెప్పారు. కాగా, మృతురాలి భర్త శనపతి శ్రీను గురువారం జరిగిన ఎన్నికల్లో బీయస్పీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.