మాస్క్‌తో..మమ..!

ABN , First Publish Date - 2021-04-15T05:30:00+05:30 IST

కరోనా రెండవ దశ వ్యాప్తి అత్యంత వేగంగా జరుగుతుండగా పాఠశాలల్లో మాత్రం కరోనా నివారణ కోసం చిన్నపాటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు.

మాస్క్‌తో..మమ..!
మార్కాపురంలో మాస్కులు లేకుండా కూర్చున్న విద్యార్థినులు



పాఠశాలల్లో కనిపించని భౌతికదూరం 

సగం మందికే మాస్కులు

కనిపించని చేతుల శుభ్రత

ప్రైవేటు స్కూల్స్‌, బస్సుల్లో 

పాటించని కొవిడ్‌ నిబంధనలు

గిద్దలూరు, ఏప్రిల్‌ 15 : కరోనా రెండవ దశ వ్యాప్తి అత్యంత వేగంగా జరుగుతుండగా పాఠశాలల్లో మాత్రం కరోనా నివారణ కోసం చిన్నపాటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. గురువారం పట్టణంలోని ఒక ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆంఽధ్రజ్యోతి విజిట్‌ చేసింది. మెయిన్‌ ఎంట్రెన్స్‌ గేటు వద్ద శానిటైజర్‌ వేసే నాథుడే లేడు. బయటి నుంచి వచ్చిన విద్యార్థులు నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లిపోతున్నారు. 50 శాతంకు మంచి మా స్కులు ధరించలేదు. స్టడీ అవర్‌లో గుంపుగా కూర్చుని మాస్కులు లేకుండానే చదువుకుంటూ కనిపించారు. తరగతి గదుల కొరత, బెంచీల కొరత కారణంగా చాలా క్లాసు రూములలో భౌతిక దూరం కనిపించలేదు. ఒకరిపక్కన ఒకరు కూర్చుని చదువుకోవలసిన పరిస్థితి నెలకొన్నది. పలు ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల బస్సుల్లో సైతం సీటింగ్‌ కెపాసిటీకి మించి విద్యార్థులను పాఠశాలకు తీసుకొస్తున్నారు. బస్సు ఎక్కేటప్పుడు గానీ, దిగేటప్పుడు గానీ శానిటైజర్‌ ఉపయోగిస్తున్న దాఖలాలు కనిపించ డం లేదు. కొంతమంది టీచర్లు సైతం మాస్కులు ధరించకుండా కొంతమంది విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు మాస్కులు ధరించకుండానే వంట చేయడం కనిపించింది. 

కంభంలో..

కంభం : కంభం మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వచ్చే  విద్యార్థులు మా స్కులు ధరించి వస్తున్నారు. విద్యార్థులు భౌతికదూరం పాటించడంలేదు.  శానిటైజర్లు వాడడం లేదు. గుంపులుగా దగ్గర గా కూర్చుంటున్నారు. మధ్యాహ్నం భో జన సమయంలో దగ్గరగా కూర్చుని తి నడం కనిపించింది. 

కరోనాపై సరైన అవగాహన లేదు

మార్కాపురం (వన్‌టౌన్‌) ఏప్రిల్‌ 15 : కరోనా నేపథ్యంలో మార్కాపురంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఆంధ్రజ్యోతి విజిట్‌ చేయగా పలు అంశాలు గుర్తించింది. పాఠశాలలో 1200 మంది బాలికలు ఉండగా దాదాపు 60 శాతం మంది మాస్కులు ధరించలేదు. తెచ్చిన మాస్కులు కూడా ఎక్కువ భాగం బ్యాగ్‌లలో పెడుతున్నారు. భౌతికదూరం పాటించడం లేదు. విద్యార్థినిల తరగతి గదులు తక్కువ కావడంతో ఈ నిబంధన పెద్దగా అమలు కావడం లేదు. ధర్మల్‌ స్రీనింగ్‌ నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో తరగతి గదిలోనే ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. శానిటైజర్‌ ఊసే లేదు. 10 గంటల 10 నిమిషాలకు పెట్టిన భోజనంలో కొన్ని గుడ్లు వాసన వస్తున్నాయి. 

ఒకే గదిలో 70 మంది

పెద్ద దోర్నాల : కొవిడ్‌ నిబంధనలను పాఠశాలలు పాటించడంలేదు. మాస్కులు  లేకుండా, భౌతికదూరం పాటించకుండా తరగతిగదుల్లో కూ ర్చుంటున్నారు. స్థానిక ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాల, కళాశాల, ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలను గురువారం ఆంధ్రజ్యోతి పరిశీలించింది. ఎ క్కువ మంది విద్యార్థులు ఉండడం, సరిపడా తరగతి గదులు లేక పో వడం కారణంగా పక్కపక్కనే విద్యార్థులు కూర్చోవలసిన పరిస్థితి నెల కొంది. ఒక్కో గదిలో 70 మంది పిల్లలు ఉంటున్నారు. ముగ్గురు కలిసి ఒకే ప్లేటులో భోజనం చేయడం, గుంపులుగా ప్లేట్లు కడుక్కోవడం కన్పించింది. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో శానిటైజ్‌ చేస్తున్న దాఖలాలు లేవు. ఇప్పటికే మండలంలో 23 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 




Updated Date - 2021-04-15T05:30:00+05:30 IST