Abn logo
Aug 2 2020 @ 18:52PM

హైదరాబాద్ : నాచారంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ : నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో గల మల్లాపూర్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ సాయంత్రం రబ్బర్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. స్థానిక సమాచారం మేరకు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.


ఆదివారం కావడంతో అందులో ఎవరూ ఉద్యోగులు లేరు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ప్రమాదం ఎలా జరిగింది..? షార్ట్ సర్క్యూటా..? మరేమైనా కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement