భారీగా పెరిగిన కమర్షియల్‌ సిలిండర్‌ ధర

ABN , First Publish Date - 2021-08-02T05:09:28+05:30 IST

గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చమురు సంస్థలు ఆదివారం మరోసారి పెంచాయి. నెలకు ఓ సారి గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఆయిల్‌ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. ఆదివారం కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.74 పెంచాయి.

భారీగా పెరిగిన కమర్షియల్‌ సిలిండర్‌ ధర

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 1: గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చమురు సంస్థలు ఆదివారం మరోసారి పెంచాయి. నెలకు ఓ సారి గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఆయిల్‌ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. ఆదివారం కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.74 పెంచాయి. దీంతో జిల్లాలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1719 నుంచి రూ.1798కి పెరిగింది. జూలై నెలలో రాయితీ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.25.50, కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.84 వరకు పెంచిన సంగతి తెలిసిందే. కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు కేవలం రెండు నెలల్లోనే రూ.158 వరకు పెరగడంతో వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా గృహ అవసరాలకు వినియోగించే రాయితీ సిలిండర్‌ ధరలను ఈ నెలలో పెంచలేదు.

Updated Date - 2021-08-02T05:09:28+05:30 IST