పాలమూరును ప్లాన్డ్‌ సిటీగా మార్చేందుకు మాస్టర్‌ప్లాన్‌

ABN , First Publish Date - 2021-05-06T05:08:49+05:30 IST

దేశంలోనే పాలమూరును ప్లాన్డ్‌ సిటీగా మార్చేం దుకు వచ్చే 20ఏళ్ల భవిష్యత్తు అవసరా లను దృష్టిలో ఉంచుకుని మాస్టర్‌ప్లాన్‌ తయారుచేయాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులకు సూచిం చారు.

పాలమూరును ప్లాన్డ్‌ సిటీగా మార్చేందుకు మాస్టర్‌ప్లాన్‌
అధికారులతో చర్చిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

 - అధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్ష

మహబూబ్‌నగర్‌, మే 5: దేశంలోనే పాలమూరును ప్లాన్డ్‌ సిటీగా మార్చేం దుకు వచ్చే 20ఏళ్ల భవిష్యత్తు అవసరా లను దృష్టిలో ఉంచుకుని మాస్టర్‌ప్లాన్‌ తయారుచేయాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులకు సూచిం చారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి ఆర్వీ అసోసి యేట్‌ ఆర్కిటెక్ట్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ ప ట్టణం హైదరాబాద్‌కు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నదని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమై న ప్రణాళికలను సిద్ధం చేయాలని అ ధికారులకు దిశా నిర్దేశించారు. పట్టణాన్ని జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ కమర్షియల్‌ సెంటర్లు, రెసిడె న్షియల్‌ జోన్లు, బైపాస్‌రోడ్డు, నూతనంగా నిర్మిస్తున్న బైపాస్‌ రోడ్డుతోపాటు మహబూబ్‌నగర్‌ను అద్భుతమైన ప్లాన్డ్‌ సిటీగా మారుద్దామన్నారు. ఈ ప్లాన్‌లో వచ్చే 20 ఏళ్ల వరకు జనాభాకు కావాల్సిన అన్ని అవసరాలను తీర్చేలా ఉండాలని చెప్పారు. పట్టణానికి చుట్టూ జాతీ య రహదారులు వస్తున్నాయని, భారత్‌మాల, మహబూబ్‌నగర్‌-చించోలి రహదారులు రానున్నాయని వీటిని దృష్టిలో ఉంచుకొని ప్లాన్‌ తయారు చేయాలన్నారు. టౌన్‌ చుట్టూ బైపాస్‌లు రింగ్‌లా వీటికి చించోలి రోడ్డు కలుస్తుందని చె ప్పారు. భవిష్యత్తులో పెరిగే జనాభా, అవసరాలను దృష్టిలో ఉంచుకుని మం చి ప్రణాళిక రూపొందించాలని కోరారు. 



Updated Date - 2021-05-06T05:08:49+05:30 IST