ప్రజలకు ఇబ్బందులు లేకుండా మాస్టర్‌ప్లాన్‌

ABN , First Publish Date - 2020-09-17T10:43:38+05:30 IST

కరీంనగర్‌ పట్టణ మాస్టర్‌ ప్లాన్‌ వాస్తవానికి దగ్గరగా లేకపోవ డంతో ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా మాస్టర్‌ప్లాన్‌

మేయర్‌ వై సునీల్‌రావు


కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 16: కరీంనగర్‌ పట్టణ మాస్టర్‌ ప్లాన్‌ వాస్తవానికి దగ్గరగా లేకపోవ డంతో ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. కమర్షియల్‌ ప్రాంతాలను రెసిడెన్షియల్‌గా, రెసిడెన్షి యల్‌ ప్రాంతాలను కమర్షియల్‌గా, 60ఫీట్ల రోడ్లుగా చూపించిన చోట 30ఫీట్లు రోడ్లు ఇలా వాస్తవానికి, మాస్టర్‌ప్లాన్‌కు పొంతన లేకుండా గందరగోళంగా ఉంది. 1998లో తయారుచేసిన రెండు మాస్టర్‌ ప్లాన్‌ను దశాబ్దాల క్రితం నుంచి అమలుచేస్తున్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రజ లకు ఇబ్బందులు లేకుండా వాస్త వికమైన మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించేందుకు ప్రభుత్వం కన్సల్టెన్సీని నియమించిందని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు.


కలెక్టరేట్‌లో బుధవారం నూతన మాస్టర్‌ప్లాన్‌ రూపొందించేందుకు కార్పొరేటర్లతో ఏర్పాటుచేసిన ప్రిలిమినరీ సమావేశంలో మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూ రిక్రాంతి పాల్గొన్నారు. ముందుగా డీడీఎఫ్‌ కన్సల్టెన్సీబృందం వివిధ అంశాలతో తయా రుచేసిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా మాస్టర్‌ప్లాన్‌పై కార్పొరేటర్లకు అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా మేయర్‌ సునీల్‌రావు మాట్లా డుతూ నూతనమాస్టర్‌ప్లాన్‌ ద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా కార్పొరేటర్లు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ పరిధిని కలుపుకొని మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందిస్తామని చెప్పారు. భవిష్యత్‌ ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని 20ఏళ్ల జనాభాకు అను గుణంగా మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందిస్తామని అన్నారు. సర్వేల్లో భవనాలు, రోడ్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ఖాళీస్థలాలు, వార్డులు, కాలనీలు, పార్కింగ్‌ స్థలాలు, మైదానాలు తదితర వాటిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. క్షేత్రస్థాయిలో రూపొం దించిన మ్యాప్‌ను ఎన్‌ఆర్‌ఎస్‌సీకి పంపిస్తామని కన్సల్టెన్సీ ప్రతినిధులు తెలిపారు. అలాగే ప్రజల నుంచి కూడా అభ్యంతరాలను, సలహాలను తీసుకునేందుకు గ్రాఫ్‌ను పబ్లిష్‌ చేస్తామని చెప్పారు.


మేధావులు, పాలకవర్గసభ్యులు, ప్రజలనుంచి అభ్యంత రాలు, సలహాలను, సూచనలను తీసుకొని ప్లాన్‌లో సవరణలు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వ అనుమతితో డ్రాఫ్ట్‌ మ్యాప్‌ను రూపొందిస్తామని అన్నారు. కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించేందుకు దాదాపు ఏడాది సమయం పట్టవచ్చని, అందరి సలహాలు, సూచనల తోపాటు క్షేత్రస్థాయిలోని వాస్తవాలు ప్రతిభింభించే విధంగా ప్రజలకు ఇబ్బందులు లేని మాస్టర్‌ప్లాన్‌ను రూపొంది స్తామని మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-17T10:43:38+05:30 IST