ముగిసిన విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

ABN , First Publish Date - 2020-11-26T05:47:59+05:30 IST

మండలంలోని పెంబి తాండ గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వ ర్యంలో నూతనంగా ఆలయాలను నిర్మించారు. ఆలయంలో సోమవారం నుండి మూడు రోజుల పాటు జగదాంబాదేవి, సేవాలాల్‌ మహరాజ్‌ విగ్రహ ప్రతిష్టాప మహోత్సవాలను కన్నులపండువగా నిర్వహించారు.

ముగిసిన విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు
ఉత్సవంలో పాల్గొన్న భక్తులు

కొలువుదీరిన జగదాంబదేవీ, సేవాలాల్‌ మహరాజ్‌

పెంబి, నవంబరు 25 : మండలంలోని పెంబి తాండ గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వ ర్యంలో నూతనంగా ఆలయాలను నిర్మించారు. ఆలయంలో సోమవారం నుండి మూడు రోజుల పాటు జగదాంబాదేవి, సేవాలాల్‌ మహరాజ్‌ విగ్రహ ప్రతిష్టాప మహోత్సవాలను కన్నులపండువగా నిర్వహించారు. బుధవారం రోజున గణపతిపూజ, పుణ్యహ వచనము, అమ్మవారి యంత్రస్థాపన, విగ్రహస్థాపన ప్రతిష్టాంగ హోమాలు, కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం హోట ల్‌, స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు కలుగకుండా మంచినీరు, షామియాలు ఇతర వసతులను ఏర్పాటు చేశారు. టీజీవో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అజ్మీరా శ్యాంనాయక్‌, మాజీ ఎంపీపీ రాథోడ్‌ రమేష్‌లు వేరు వేరుగా పూజా కార్యక్రమాలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ టీసీ జానుబాయి, సర్పంచ్‌ కున్సోత్‌ కరుణ, మాజీ ఎంపీపీ సల్లా రామేశ్వర్‌రెడ్డి, నాయకులు సల్లా నరేందర్‌రెడ్డి, స్వప్నిల్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామకమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-26T05:47:59+05:30 IST