Abn logo
Oct 24 2021 @ 00:42AM

తల్లీబిడ్డ అదృశ్యం: కేసు నమోదు

 ఓబుళదేవరచెరువు,  అక్టోబరు 23:  మండల పరిధిలోని కుసుమవారిప ల్లికి చెందిన నరసింహులు భార్య వీరమ్మ, కుమార్తె లిఖిత అదృశ్యం కావడం పై శని వారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కే గోపీ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు కుసు మవారిపల్లికి చెందిన వీరమ్మ ఆమె కుమార్తె ఆరు సంవత్సరాల లిఖితతో కలి సి మండల పరిధిలోని తిప్పేపల్లిలో ఆమె సోదరి ఇంటి నుండి ఈ నెల 9న  వెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.  ఆచూకీ తెలిసిన వారు ఎస్‌ఐ 9490114572 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని, సమా చారం ఇచ్చిన వారికి పారితోషికం ఇవ్వనున్న ట్లు ఎస్‌ఐ తెలిపారు.