Abn logo
Sep 18 2021 @ 22:48PM

మెమో రైలు పునరుద్ధరించండి

సూళ్లూరుపేట, సెప్టెంబరు 18 : నెల్లూరు-చెన్నై మెమో రైలు రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని దక్షిణ రైల్వే మేనేజర్‌ గణేష్‌కు జడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు తాటిపర్తి ఆదినారాయణ తెలియజేశారు. శనివారం డీఆర్‌ఎం సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణ స్థానిక సమస్యలను ఆయనకు విన్నవించారు. సూళ్లూరుపేట  రైల్వేస్టేషన్‌ తూర్పు వైపు టికెట్‌ కౌంటర్‌ నిర్మించి మూడేళ్లైనా ఇంతవరకూ వినియోగంలోకి తేలేదని తెలిపారు. తహసీల్దారు కార్యాలయం వద్ద అండర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిపివేసి, రైల్వే గేటు మార్గాన్ని పునరుద్ధరించారని, వెంటనే అండర్‌ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని విన్నవించారు.  రైల్వే స్టేషన్‌లో వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం లిఫ్ట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం డీఆర్‌ఎం చెంగాళమ్మ ఆలయాన్ని సందర్శించారు.