మహిళల అభ్యున్నతికి చర్యలు

ABN , First Publish Date - 2022-03-09T04:24:47+05:30 IST

మహిళల అభ్యున్నతి, రక్షణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి అమలు చేస్తోందని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు.

మహిళల అభ్యున్నతికి చర్యలు
ఆసిఫాబాద్‌లో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి
- జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఆసిఫాబాద్‌ రూరల్‌, మార్చి 8: మహిళల అభ్యున్నతి, రక్షణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి అమలు చేస్తోందని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని వాసవి భవన్‌లో జిల్లా స్త్రీ, శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళా అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని సన్మానించారు. అలాగే కోర్టు ఆవరణలో, ఎస్పీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తాటియా గార్డెన్స్‌లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో న్యాయమూర్తులు నారాయణబాబు, ఉమామహేశ్వరి, శరీనా, ఎస్పీ సురేష్‌కుమార్‌, రాష్ట్ర మహిళా కమీషన్‌ మెంబర్‌ ఈశ్వరిబాయి, ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు, సురేష్‌, డీఎస్పీ శ్రీనివాస్‌, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి మనోహర్‌, జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి సురేందర్‌, గ్రంథాలయ చైర్మన్‌ యాదవరావు, డీడీ మణెమ్మ, జిల్లా సంక్షేమ శాఖాధికారి సావిత్రి, డీటీఓ లక్ష్మి, జీసీడీవో శకుంతల తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌:  పట్టణలోని మున్సిపల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సతీమణి కోనేరు రమాదేవిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  కోనప్ప మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలు స్వయశక్తితో ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ విధాలు చేయూతనిస్తోందన్నారు. తప్పకుండా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగాలన్నారు. పీఆర్టీయూటీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు ఎమ్మెల్యే సతీమణిని సన్మానించారు. టీయూటీఎప్‌ ఆఽధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కళ్యాణి విద్యాసాగర్‌ మాట్లాడారు. టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళ దినోత్సవ వేడుకల్లో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి త్రివేణి మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని కోరారు. సీనియర్‌ సిటిజన్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సులను సన్మానించారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సిర్పూరు తాలుకా ఇన్‌చార్జి డాక్టర్‌ శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ అనిత మాట్లాడుతూ ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగాలన్నారు.  ఆయా కార్యక్రమాల్లో టీయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు శాంతికుమార్‌, జిల్లా బాధ్యులు పోచయ్య, నాగేశ్వర్‌ రావు, డాక్టర్‌ సునిత రావూజీ, వివిధ వార్డుల కౌన్సిలర్లు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, సీనియర్‌ సిటిజన్స్‌ జిల్లా అధ్యక్షులు పూర్ణ చందర్‌ రావు, రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ, ఫాతిమా కాన్వెంటు ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ స్మిత తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌ టౌన్‌:  కాగజ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో మహి ళా పోలీసులను ఘనంగా సన్మానించారు. టౌన్‌ సీఐ రవీందర్‌ ఆధ్వ ర్యంలో మహిళా పోలీసులను సన్మానించారు. కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
పెంచికలపేట: మండల కేంద్రంలో జడ్పీటీసీ సరిత, ఎంపీపీ సుజాత ఆధ్వర్యంలో మహిళా అధికారులకు శాలువాలతో సారే పెట్టి ఘనంగా సన్మానించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి రాఖీలు కట్టారు.  కార్యక్రమంలో సర్పంచ్‌లు కమల, ఈశ్వరి, శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌  మండలాధ్యక్షుడు తిరుపతి, నాయకులు రాజన్న, శ్రీనివాస్‌, వెంకటాచలం, శ్రీనివాస్‌, బాబు, సత్తన్న, రాజేష్‌, ఇలియాజ్‌, రామన్న, కృష్ణ, రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి: ముండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామసాయి యూత్‌ వెల్ఫేర్‌ సోసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్ను లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో సోసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయుడు దేవాజీ, మాలి సంఘం అధ్యక్షుడు బాపురావు, నాయకులు హరీష్‌, వెంకటేష్‌, అశోక్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  కేజీబీవీలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీపీ నానయ్య, జడ్పీటీసీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణి: మండల కేంద్రంలోని విద్యుత్‌ శాఖ కార్యాలయంలో సబ్‌ ఇంజనీర్‌ ప్రణీతతో పాటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో లెక్చరర్లను, విద్యుత్‌ శాఖ సిబ్బందిని శాలువాలతో సన్మానించారు.  కార్యక్రమంలో సిబ్బంది కృష్ణ, నిరంజన్‌, రతీష్‌, రమేష్‌, వామన్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు: మండల కేంద్రంలోని రైతు వేదికలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బెజ్జూరు, సలుగుపల్లి, సోమిని, కుంటలమానేపల్లి  ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకుని మహిళా ఉద్యోగులను సన్మానించారు. రైతు వేదికలో మహిళా ప్రజాప్రతినిధులు, డ్వాక్రా మహిళాలను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ రోజారమణి, జడ్పీటీసీ పుష్పలత, కో ఆప్షన్‌ సభ్యుడు బషరత్‌ఖాన్‌, ఎంపీటీసీ పర్వీన్‌ సుల్తానా, సర్పంచ్‌లు గంగారాం, శారద, ఏపీఎం రాజ్‌కుమార్‌, ఎస్‌ఓ అరుణ, హెచ్‌ఎం పార్ధిరాం, గోపాల్‌, భుజంగరావు, జయంతి, నాయుకలు సకారాం, వెంకన్న, నరేందర్‌ గౌడ్‌, మహేష్‌, ఓం ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన: గోలేటి టౌన్‌ షిప్‌లో సర్పంచ్‌ సుమలత ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను, ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందిని సన్మానించారు. బీజేపీ ఆధ్వర్యంలో సీఈఆర్‌ క్లబ్‌లో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆంజనేయులుగౌడ్‌, కృష్ణకుమారి, విజయపాల్గొన్నారు.
కౌటాల: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి పాల్గొని ముత్తంపేట గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో 17 ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు కోటి రూపాయల రుణాలకు సంబంధించి చెక్కును అందజేశారు.  మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ స్వరూపతో పాటు అధ్యాపకులు రజిత, సమత, తస్లీమున్నీసా బేగంలను తోటి అధ్యాపకులు సన్మానించారు. అటవీ శాఖ నర్సరీలో పనులు నిర్వహించే మహిళా కూలీలను ఎఫ్‌బీఓ ప్రభాకర్‌, విద్య దంపతులు సన్మానించి కేక్‌ కట్‌ చేశారు. అలాగే సదాశివపేట కన్యకాపరమశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది, మహిళలను సన్మానించి కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విశ్వనాథ్‌, జడ్పీటీసీ అనూష, నాయకులు పాల్గొన్నారు.
దహెగాం: దహెగాం మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ శ్రీరామరావు, ఎంపీపీ సులోచనలు ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు మహిళా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల సమాఖ్య అధ్యక్షురాలను సారె, చీరలతో ఘనంగాసన్మానించారు. అలాగే కేజీబీవీలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ సంతోష్‌గౌడ్‌, ఏపీఎం చంద్రశేఖర్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్‌(టి): మండల కేందరంలోని ఈడెన్‌గార్డెన్‌ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.  జిల్లా పరిషత్‌ పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జైనూరు, మార్చి8: సమాజంలో మహిళా శక్తి అత్యంత గొప్పదని ఆదివాసీ మహిళా సంక్షేమ పరిషత్‌ జిల్లా అధ్యక్షురాలు గొడాం జంగు బాయి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు రాణి దుర్గావతి విగ్రాహా నికి పూల మాలలు వేసి నివాళుళు ఆర్పించారు.  ఈ సందర్భంగా తుడుం దెబ్బ నాయకులు స్థానిక ఎస్‌ఐ మధుకర్‌ను శాలువ కప్పి సన్మానించారు. తుడుందెబ్బ రాష్ట్ర గౌరవ జిల్లా అధ్యక్షుడు మేస్రాం మోతిరాం, జిల్లా ఉపాధ్యక్షుడు గే డాం గోపిచంద్‌ తదితరులు మహిళలను సన్మానించారు. కార్యక్రమం లో నాయకులు ఉప్పుల మమత, కోగికనక బూదుబాయి.  ఆదివాసీ నాయకులు కోట్నాక భీంరావ్‌ తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి: పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాస్‌ 20 మంది వృద్థులకు ఉచితంగా కంటి అద్దాలు అందజేశారు. అనంతరం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని శాలువతో సన్మానించారు. ఐకేపీ, బీజేపీ ఆధ్వర్యంలో మహిళలను సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో సీఐ సుధాకర్‌, ఎస్సై డీకొండ రమేష్‌, ఐకేపీ ఏపీఎం మహేష్‌, బ్యాంక్‌ మేనేజర్‌ గోపాల్‌, బిజేపీ జిల్లా కార్యదర్శి కోట్నక విజయ్‌, మండల అధ్యక్షుడు రామగిరి శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.            

Updated Date - 2022-03-09T04:24:47+05:30 IST