నిత్యావసర సరుకుల కొరతలేకుండా చర్యలు: ఐటీడీఏ పీవో

ABN , First Publish Date - 2020-03-27T10:06:29+05:30 IST

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఏజెన్సీలో నిత్యావసర సరుకుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో డీకే బాలాజీ అధికారులను

నిత్యావసర సరుకుల కొరతలేకుండా చర్యలు: ఐటీడీఏ పీవో

పాడేరు: లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఏజెన్సీలో నిత్యావసర సరుకుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, జీసీసీ, ఎంపీడీవోలతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సరుకుల రవాణాకు ఆటంకాలు ఏర్పడకుండా చూడాలని స్పష్టం చేశారు.


వ్యాపారులు నిత్యావసర సరకుల ధరలు పెంచకుండా పర్యవేక్షించాలన్నారు. జాతర్లు, సామూహిక విందులు నిర్వహిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. వైద్య సిబ్బంది, గ్రామ వలంటీర్లు సమగ్రంగా సర్వే చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌, డీఎల్‌పీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-27T10:06:29+05:30 IST