మెదక్‌ జిల్లాలో మహిళా ఓటర్లే అధికం

ABN , First Publish Date - 2021-01-16T06:03:50+05:30 IST

ఎన్నికల్లో అందరూ పాలు పంచుకునేలా భారత ఎన్నికల సంఘం ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతోంది. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటా ఓటర్ల జాబితా సవరణ చేపడుతూ కొత్త ఓటర్లను నమోదు చేస్తున్నారు. గతేడాది నవంబరులో ముసాయిదా ఓటర్ల జాబితాను.. తాజాగా తుది జాబితాను శుక్రవారం విడుదల చేశారు. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుదిజాబితాకు వచ్చేసరికి జిల్లాలో ఓటర్ల సంఖ్య తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మెదక్‌ జిల్లాలో మహిళా ఓటర్లే అధికం

మొత్తం ఓటర్లు 4,12,429 మంది

తుది ఓటరు జాబితా ప్రకటన

మహిళలు 2,11,592.. పురుషులు 2,00,830 మంది

కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు  2,585 మంది 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జనవరి 15 : ఎన్నికల్లో అందరూ పాలు పంచుకునేలా భారత ఎన్నికల సంఘం ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతోంది. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటా ఓటర్ల జాబితా సవరణ చేపడుతూ కొత్త ఓటర్లను నమోదు చేస్తున్నారు. గతేడాది నవంబరులో ముసాయిదా ఓటర్ల జాబితాను.. తాజాగా తుది జాబితాను శుక్రవారం విడుదల చేశారు. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుదిజాబితాకు వచ్చేసరికి జిల్లాలో ఓటర్ల సంఖ్య తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


తగ్గిన ఓటర్లు 3,769 మంది

జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 576 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వాటిల్లో మొత్తం 4,12,429 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2,11,592 మంది మహిళలు కాగా.. 2,00,830 మంది పురుషులు. ఏడుగురు ఇతరులు ఉన్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. గతేడాది నవంబరులో ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 4,15,198 మంది ఉండగా.. కొత్తగా 2,585 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వారిలో మెదక్‌ నియోజకవర్గంలో 1,758 మంది, నర్సాపూర్‌లో 827 మంది ఉన్నారు. అయితే చనిపోయిన వారు, పెళ్లి చేసుకుని వెళ్లిన వారి పేర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి 6,354 పేర్లను తొలగించారు. అందులో మెదక్‌లో 2,864 మంది, నర్సాపూర్‌లో 2,490 మంది ఉన్నారు. మార్పులు, చేర్పుల అనంతరం తుది జాబితాను శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి విడుదల చేశారు. ఆ జాబితా ప్రకారం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కలిపి 3,769 మంది ఓటర్లు తగ్గారు. 


నియోజకవర్గాల వారీగా ఓటర్లు

నియోజకవర్గం     మహిళలు      పురుషులు    ఇతరులు మొత్తం

మెదక్‌             1,06,185        98,141         1         2,04,429

నర్సాపూర్‌          1,05,407       1,02,689        6         2,08,102

మొత్తం            2,11,592       2,00,830        7         4,12,429

Updated Date - 2021-01-16T06:03:50+05:30 IST