డెంగీ, మలేరియాపై జాగ్రత్తగా ఉండాలి

ABN , First Publish Date - 2021-10-25T04:42:18+05:30 IST

డెంగీ, మలేరియా కేసులు నమోదు అవుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టరు సిహెచ్‌ మురళీకృష్ణ తెలియజేశారు.

డెంగీ, మలేరియాపై జాగ్రత్తగా ఉండాలి
వివరాలు తెలుసుకుంటున్న డాక్టరు మురళీకృష్ణ

బుట్టాయగూడెం, అక్టోబరు 24: డెంగీ, మలేరియా కేసులు నమోదు అవుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టరు సిహెచ్‌ మురళీకృష్ణ తెలియజేశారు. చెంచుగూడెంకు చెందిన తెల్లం వెంకన్నబాబు డెంగీ బారిన పడడంతో ఆదివారం గ్రామాన్ని సందర్శించి వైద్యాధికారి డాక్టరు కె.ప్రియదర్శిని, కుటుంబ సభ్యుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏలూరులో చదువుకుంటున్న వెంకన్నబాబు స్నేహి తుడి ఇంటికి జంగారెడ్డిగూడెం వెళ్లిన తర్వాత డెంగీ నిర్ధారణ అయినట్లు తెలిపారు. గ్రామంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేసి ప్రజలకు వైద్యపరీక్షలు జరిపి అనారోగ్యంతో ఉన్నవారికి మందులు పంపిణి చేశామన్నారు. బాధితు డి ఇంటి పరిసరాలను పరిశీలించి నివారణ చర్యలు చేపట్టారు. ప్రజలు సీజ నల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగ్యూ, మలేరియా జ్వరాలు రావడానికి గల కారణాలను ప్రజలకు వివరించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటికి తిరిగి లార్వా సర్వే, ఫీవర్‌ సర్వే చేయించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని తెలిపారు. గ్రామంలో ముందు జాగ్రత్త చర్యగా దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. కార్యక్రమంలో మలేరియా సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ వి.పెద్దిరా జు, సచివాలయం, వైద్య, ఆరోగ్యశాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T04:42:18+05:30 IST