ధ్యానం సర్వరోగ నివారిణి

ABN , First Publish Date - 2021-10-23T04:22:33+05:30 IST

ధ్యానం సర్వరోగ నివారిణియని సర్వాత్మ పిరమిడ్‌ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్‌ పత్రీజీ అన్నారు.

ధ్యానం సర్వరోగ నివారిణి
ధ్యానం గురించి వివరిస్తున్న సుభాష్‌ పత్రీజీ

బాన్సువాడ టౌన్‌, అక్టోబరు 23 : ధ్యానం సర్వరోగ నివారిణియని సర్వాత్మ పిరమిడ్‌ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్‌ పత్రీజీ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ధ్యాన చైతన్య మహాయాగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యానంతో అన్నీ సాధించవచ్చని, ప్రతీ మనిషి సర్వాత్మగా మారాలని సూచించారు. ధ్యానం అంటే శ్యాస మీద ధ్యాస అని, ధ్యానం చేసిన వ్యక్తులు శక్తివంతులుగా మారుతారన్నారు. ధ్యానం చేసిన ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతుందని, వ్యక్తులు ఆత్మజ్యోతులుగా మారుతారన్నారు. అందరూ ధ్యానులుగా మారి దేశాన్ని సస్యశ్యామలం చేయాలన్నారు. ధ్యానం చేసిన వ్యక్తికి ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. ఈ సృష్టిలో అందరూ మాంసాహారం వీడిశాఖాహారులుగా మారాలని, ధ్యాన మార్గం వైపునకు నడవాలని పిలుపునిచ్చారు. శాఖాహారంతో మనుషులుగా మారుతామని, ధ్యానహారంతో దేవుడిగా మారతారని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మెన్‌పోచారం భాస్కర్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ పాత బాలకృష్ణ, సొసైటీ చైర్మెన్‌ పిట్ల శ్రీధర్‌, గురువినయ్‌, బద్యానాయక్‌, బెజుగం శంకర్‌ స్వామి, ధ్యానకేంద్రం సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది : స్పీకర్‌
బాన్సువాడ పట్టణం ప్రతీ నిత్యం భగవత్‌ కార్యక్రమాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.  శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలప్రాంగణంలో నిర్వహించిన ధ్యాన చైతన్య మహాయాగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఽ18 యోగాలలో ధ్యాన యోగం విశిష్టమైందన్నారు. ధ్యానంతో అనేక రోగాలు దూరమవుతాయని, ప్రతీ ఒక్కరు దైనందిన జీవితంలో ధ్యానం చేయడం అలవర్చుకోవాలన్నారు. ధ్యానానికి శక్తి ఎక్కువని, దాని వల్ల మనశ్శాంతి, జ్ఞానం కలుగుతుందన్నారు. మనస్సుని లగ్నం చేసుకుని ఏకాగ్రతతో ధ్యానం అనేక సత్ఫలితాలు సిద్దిస్తాయన్నారు.

Updated Date - 2021-10-23T04:22:33+05:30 IST