ఈజిప్టులో నిలిచిపోయిన భారీ ఓడపై నెట్టిట్లో వైరల్ అవుతున్న మీమ్స్

ABN , First Publish Date - 2021-03-27T02:15:27+05:30 IST

..

ఈజిప్టులో నిలిచిపోయిన భారీ ఓడపై నెట్టిట్లో వైరల్ అవుతున్న మీమ్స్

ఇంటర్నెట్ డెస్క్: ఈజిప్ట్‌లోని సూయిజ్ కాలువకు ఓ భారీ కంటైనర్ షిప్ అడ్డుగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. మంగళవారం వీచిన భారీ గాలులకు ఈ షిప్ అడ్డం తిరిగి ఇలా అడ్డుగా నిలిచిపోయింది. దీంతో అధికారులు ఆ దారిలో వెళ్లాల్సిన అనేక షిప్పులను నిలిపివేశారు. దానిని అక్కడి నుంచి తొలగించేందుకు అనేకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఓ బుల్డోజర్‌ను తీసుకొచ్చి మట్టిని త్వవడం మొదలు పెట్టారు. అయితే ఆ భారీ ఓడ ముందు అది చాలా చిన్నదిగా, ఏదో బొమ్మ బుల్డోజర్‌లా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దీనిపై విపరీతంగా మీమ్‌లు షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. 


చాలా మంది తమ జీవితానికి సైతం ఈ ఫోటోను అన్వయించుకుని మీమ్‌లు తయారు చేస్తున్నారు. తమ జీవితంలో సమస్యలు అడ్డంగా నిలిచిపోయిన భారీ ఓడ సైజులో ఉంటే.. వాటి నుంచి బయటపడడానికి తాము చేసే ప్రయత్నాలను ఆ బుల్డోజర్‌తో పోల్చుకుంటున్నారు.

Updated Date - 2021-03-27T02:15:27+05:30 IST