ఏమాత్రం బుద్ధి ఉన్నా... మంత్రి వెంటనే రాజీనామా చేయాలి : మేనకా గాంధీ ఫైర్

ABN , First Publish Date - 2020-06-03T23:01:26+05:30 IST

కేరళలో పైనాపిల్ బాణాసంచాతో ఏనుగును చంపిన ఘటనపై జంతు ప్రేమికురాలు, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ స్పందించారు. మలప్పురం జరిగిన ఘటనపై

ఏమాత్రం బుద్ధి ఉన్నా... మంత్రి వెంటనే రాజీనామా చేయాలి : మేనకా గాంధీ ఫైర్

న్యూఢిల్లీ : కేరళలో పైనాపిల్ బాణాసంచాతో ఏనుగును చంపిన ఘటనపై జంతు ప్రేమికురాలు, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ స్పందించారు. మలప్పురం జరిగిన ఘటనపై కేరళ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆమె మండిపడ్డారు. చర్యలు తీసుకోడానికి పినరయ్ సర్కార్ జంకుతోందని ఆరోపించారు.


‘‘ ఏనుగు సంఘటన హత్యే. ఇలాంటి దుశ్చర్యలకు మలప్పురం ముందు నుంచీ చాలా ప్రఖ్యాతి చెందింది. దేశంలోనే అత్యంత హింసాత్మక జిల్లా ఇది. రోడ్లపై విషాన్ని చల్లేస్తారు. దీంతో ఒక్కసారే మూడు వందల నుంచి నాలుగు వందల కుక్కలు మరణించాయి. కేవలం 20,000 ఏనుగులు మాత్రమే మన దేశంలో మిగిలి ఉన్నాయి. అవి కూడా మెళ్లి మెళ్లిగా అంతమైపోతున్నాయి’’ అని మేనకా గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

కేరళ అటవీ శాఖ కార్యదర్శి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అటవీ శాఖా మంత్రికి ఏ మాత్రం బుద్ధున్నా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అదే నియోజకవర్గానికి చెందిన ఎంపీ అని, ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని మేనకా గాంధీ సూటిగా ప్రశ్నించారు. 

Updated Date - 2020-06-03T23:01:26+05:30 IST