Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ భూముల్నీ.. వదల్లేదు..!

పట్టా భూముల్లో  అక్రమ మైనింగ్‌

వైసీపీ కార్యకర్త భూములను  వదలని అధికారపార్టీ నేతలు 

భూముల్లోకి వస్తే చంపేస్తామంటు బెదిరింపులు

మూడుతరాల నాటి భూములు లాగేసుకున్న వైనం 

న్యాయస్థానం ఆదేశాలున్నా ఆగని దందా


మాచవరం/పిడుగురాళ్ల, డిసెంబరు3: మూడుతరాల నుంచి వారసత్వంగా వస్తున్న భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు.. అక్రమమైనింగ్‌కు తెగబడ్డారు... అదేమిటని అడిగితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులు మరె వరికో కాదు.. గత ఎన్ని కల్లో వైసీపీ తర ఫున పనిచేసిన అన్న దమ్ములకే..! వివరా ల్లోకి వెళితే.. జిల్లాలోని మాచవరం మండ లం రేగులగడ్డకు చెందిన వైసీపీ కార్యకర్త సయ్యద్‌ నాగుల్‌ మీరా తన సోదరుడితో కలిసి గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు. వీరికి సంబంధించి సాగు లో ఉన్న సర్వేనెంబర్‌ 639/2హెచ్‌1, 639/2 హెచ్‌2లో కొంత భూమికి కొన్నేళ్ల క్రితమే రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలిచ్చారు. కొన్నాళ్లుగా ఆ భూముల్లో గురజాల, మాచవరం మండలాలకు చెందిన వైసీపీ నేతలు కొందరు అక్రమమైనింగ్‌కు పాల్పడుతున్నారు. తమ సొంత భూముల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను ఆపాలని సదరు అన్నదమ్ములు రెవెన్యూ, సర్వే, పోలీసు అధికారులతోపాటు జిల్లా కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. అయినా స్పందన కనిపించకపోవటంతో న్యాయస్థానాన్ని ఆశ్ర యించారు. నాగుల్‌మీరా పట్టాదారుపాస్‌ పుస్తకా లు పొందిన సర్వే నెంబర్లలో అక్రమమైనింగ్‌ నిలిపివేయాలని న్యాయస్థానం గత నెలలో ఉత్తర్వులిచ్చింది. ఆ ప్రాంతంలో మైనింగ్‌ అనుమతులున్నాయో.. లేవో తేల్చాలని సూచించింది. అయినా అధికారుల్లో స్పందన కరువైంది. రోజుకు 20 ట్రిప్పులకుపైగా సున్నపురాయి ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ చెల్లించకుండానే దొడ్డిదారిన తరలిపోతున్నా అధి కారుల్లో చలనంలేదు.


మా భూముల్లో వైసీపీ నేతల మైనింగ్‌..

మేము వైసీపీ గెలుపునకు పనిచేశాం. మూడు తరాల నుంచి వారసత్వంగా వస్తున్న భూముల్లో మాపార్టీకే చెందిన కొందరు అక్రమ మై నింగ్‌ చేస్తున్నారు. ఇదేమంటే బెదిరిస్తున్నారు. పక్క సమీప భూముల్లో మైనింగ్‌ పొంది మా భూముల్లోకి చొర బడి చేస్తోన్న అక్రమ మైనింగ్‌ చేస్తున్నారు. బ్లాస్టింగ్‌ వల్ల పొలాల్లో బండరాళ్లు పడుతుండటంతో పక్క నున్న రైతులకు ఇబ్బంది కలుగుతుంది. మా భూములేవో సర్వే చేయాలని అధికారులను కోరుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదు.  

- సయ్యద్‌ నాగుల్‌మీరా 

Advertisement
Advertisement