గరగపర్రు పంచాయతీ వద్ద అంబేడ్కర్‌ విగ్రహం

ABN , First Publish Date - 2022-01-20T05:24:20+05:30 IST

పాలకోడేరు మండలం గరగపర్రులో అంబేడ్కర్‌ విగ్రహం తొలగింపుపై ఇరు వర్గాల మధ్య వివాదానికి పరిష్కారం లభించింది.

గరగపర్రు పంచాయతీ వద్ద అంబేడ్కర్‌ విగ్రహం
చర్చలు జరుపుతున్న మంత్రి, అధికారులు

మంత్రి, అధికారుల సమక్షంలో వివాదం పరిష్కారం


తాడేపల్లిగూడెం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పాలకోడేరు మండలం గరగపర్రులో అంబేడ్కర్‌ విగ్రహం తొలగింపుపై ఇరు వర్గాల మధ్య వివాదానికి పరిష్కారం లభించింది. పంచాయతీ వద్ద విగ్రహం ఏర్పాటుకు ఇరువర్గాలు అంగీకరించాయి. మంత్రి చెరుకు వాడ శ్రీరంగనాథరాజు నేతృత్వం లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తాడేపల్లిగూడెంలోని మంత్రి క్యాంప్‌ కార్యా లయంలో బుధవారం సమావేశమైంది. మంత్రి రంగరాజు, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, వైసీపీ నేత మంతెన యోగేందర్‌ కుమార్‌ సమావేశంలో పాల్గొన్నారు. గరగపర్రు నుంచి ఇరు వర్గాలకు చెందిన సర్పంచ్‌ రామకృష్ణంరాజు, రాజా సుందర్‌బాబు ఆయన అనుచ రులు హాజరయ్యారు. వివాదంపై ఇరువర్గాలతో చర్చల్లో గ్రామ పంచాయతీ వద్ద అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు అంగీకరించారు. అనువైన ప్రాంతంలో అంబేడ్కర్‌ డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్టు రంగరాజు తెలిపారు. ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చస్తామని హామీ ఇచ్చారు. కమిటీ ప్రతిపాదనలపై ఇరు వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.

Updated Date - 2022-01-20T05:24:20+05:30 IST