Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీజేపీ చేస్తున్న ఆందోళనలకు అర్థం ఉందా?: Gangula

కరీంనగర్: రైతుల జీవితాలతో బీజేపీ ఆడుకుంటోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీజేపీ చేస్తున్న ఆందోళనలకు అర్థం ఉందా అని ప్రశ్నించారు. ప్రజలను బీజేపీ తప్పు దోవ పట్టిస్తోందని విమర్శించారు. ధర్నా ఎందుకు చేస్తున్నారో బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్నా చేయాల్సింది తెలంగాణలో కాదు ఢిల్లీలో అని అన్నారు. బీజేపీ అబద్ధాల మీద బతుకుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ దొంగ మాటలు, దొంగ దీక్షలు నమ్మొదన్నారు. యాసంగి పంట కొనం అని ఈటెల రాజేందర్ ఒప్పుకున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement