బూస్టర్‌ డోస్‌తో ప్రయోజనాలున్నాయి... అనుమానాలొద్దు: మంత్రి Harish rao

ABN , First Publish Date - 2022-01-10T19:31:16+05:30 IST

బూస్టర్‌ డోస్‌తో ప్రయోజనాలున్నాయని.. అనుమానాలొద్దని మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం రాష్ట్రంలో బూస్టర్‌ డోస్‌ను మంత్రి ప్రారంభించారు.

బూస్టర్‌ డోస్‌తో ప్రయోజనాలున్నాయి... అనుమానాలొద్దు: మంత్రి Harish rao

హైదరాబాద్: బూస్టర్‌ డోస్‌తో ప్రయోజనాలున్నాయని.. అనుమానాలొద్దని మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం రాష్ట్రంలో బూస్టర్‌ డోస్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని సూచించారు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో కూడా బూస్టర్‌ డోస్‌ వేసుకుంటున్నారని తెలిపారు. హెల్త్‌ కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60ఏళ్లు పైబడిన వారు డోస్‌ వేసుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధులంతా ఇందులో భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ వేగంగా పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామని అన్నారు. యునానీ ఆస్పత్రిలో సమస్యలపై చర్చించామని... ఆస్పత్రిలో ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా టీకాలు అందిస్తోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-10T19:31:16+05:30 IST