బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు: Harishrao
ABN , First Publish Date - 2021-09-16T18:25:54+05:30 IST
హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కనుమరుగైందని మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం హుజురాబాద్‌లో విశ్వ బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
కరీంనగర్: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కనుమరుగైందని మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం హుజురాబాద్‌లో విశ్వ బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ వైపు ఉంటే లాభమా.. టీఆర్ఎస్ వైపు ఉంటే లాభమా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. రూపాయి బొట్టుబిల్లకు..లక్ష రూపాయలు ఇచ్చే కల్యాణ లక్ష్మీకి మధ్య పోటీ జరుగుతోందని తెలిపారు. బీసీలకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వర్గంలో బీసీ మంత్రిత్వ శాఖ కూడా లేదన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో లేదని, వచ్చే అవకాశం కూడా లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.