నందిపేట మండలంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటన

ABN , First Publish Date - 2021-06-22T05:31:56+05:30 IST

నందిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో సోమ వారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు.

నందిపేట మండలంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటన
మంత్రికి స్వాగతం పలుకుతున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

నందిపేట, జూన్‌ 21: నందిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో సోమ వారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు.  మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన డొంకే శ్వర్‌ గ్రామపంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి తో డ్పాటునందించాలని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నక్కల భూమేష్‌, సర్ప ంచ్‌లు, నాయకులు చాయ, రామల పోశెట్టి, కుర్మే దేవేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T05:31:56+05:30 IST