Abn logo
Oct 22 2021 @ 12:22PM

ముఖ్యనేతలతో మంత్రి కేటీఆర్ వరుస సమావేశాలు

హైదరాబాద్: నియోజకవర్గాల ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజుకు 20 నియోజకవర్గాల చొప్పున పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ అవుతున్నారు. వరుసగా ఐదో రోజు  తెలంగాణ భవన్‌లో నియోజకవర్గ పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశం కొనసాగుతోంది. పార్టీ ప్లీనరీ, నవంబర్ 15న విజయగర్జన సభ జయప్రదం చేయడంతో పాటు, నియోజకవర్గ పార్టీలో అంతర్గత సమస్యలపై  పార్టీ నేతలతో కేటీఆర్ చర్చిస్తున్నారు. ఉదయం జనగామ, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి వరంగల్ వెస్ట్, మహబూబాద్ దోర్నకల్, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  భేటీ అయ్యారు. అలాగే మధ్యాహ్నం నిర్మల్, ముధోల్, సిర్పూర్ కాగజ్ నగర్, అసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...