బడుగువర్గాల్లో చైతన్యం తెచ్చిన వంగపండు

ABN , First Publish Date - 2020-08-05T10:32:45+05:30 IST

బడుగు వర్గాల్లో వంగపండు ప్రసాదరావు తన గీతాలతో చైత న్యం తీసుకువచ్చారని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

బడుగువర్గాల్లో చైతన్యం తెచ్చిన వంగపండు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు


సిరిపురం, ఆగస్టు 4: బడుగు వర్గాల్లో వంగపండు ప్రసాదరావు తన గీతాలతో చైత న్యం తీసుకువచ్చారని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. వంగపండు ప్రసాదరావు మృతిపై వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో సాంస్కృతిక శాఖ ఆధ్వ ర్యంలో మంగళవారం సంతాపసభ నిర్వహించారు. మంత్రి ముత్తంశెట్టి వంగపండు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగపండు పేరు విశాఖలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రభుత్వం తరపున కృషి చేస్తానని చెప్పారు.


సీసీఐ నాయకుడు జేవీ సత్యనారాయణమూర్తి, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని అన్నారు. వంగపండు కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. గాయకుడు దేవిశ్రీ వంగపండు ఇకలేరు గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ఆర్డీఓ పెంచల కిశోర్‌, ఆచార్య చందు సుబ్బారావు, రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వీవీ రమణమూర్తి, వైసీపీ నాయకుడు కేకే రాజు, వి.మణిరాం, పూర్ణిమాదేవి, వి.మారుతీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-05T10:32:45+05:30 IST