Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీఆర్వోలపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరం

నంబులపూలకుంట, డిసెంబరు 2: రాష్ట్ర మంత్రి అప్పలరాజు వీఆర్‌ఓలు సచివాల యాలకు వస్తే తరమండి అంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఓలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఓ లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తే 90 శాతం పథకాలను ప్రజలకు చేర్చడానికి వీఆర్‌ఓలు సేవ లు అందిస్తున్నామన్నారు. సచివాలయాలకు వస్తే సర్పం చులు, ఎంపీటీసీలు తరమండి అంటూ మంత్రి వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్య లు వెనక్కు తీసుకోవాలని కోరారు. కాశీ బుగ్గ మున్సిపల్‌ కమిషనర్‌ రాజగోపాల్‌ అక్కడ పనిచేస్తున్న వీఆర్‌ఓలను మానసికంగా హింసించడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం వెంటనే అతని పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం తదితర డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్‌ క్రాంతికుమార్‌కు వీఆర్‌ఓలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఓలు జయరాములు, గంగాధర్‌, రమేష్‌, కిష్టప్ప, శకుంతల, అనూష, దీపిక, ఆంజనేయులు, రవీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

కొత్తచెరువు: వీఆర్‌ఓలపై మంత్రి అప్పలరాజు చేసిన  వ్యాఖ్యలపై వీఆర్‌ఓలు నిరసన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ వెంకట రెడ్డికి వీఆర్‌ఓలు రవిశేఖర్‌రెడ్డి, ఆశోక్‌, లక్ష్మీనారాయణ, చెన్నయ్య, శ్రీనివాసులు తదితరులు నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం అందించారు.


Advertisement
Advertisement