నేడు వైద్య ఆరోగ్యశాఖపై మంత్రి సమీక్ష

ABN , First Publish Date - 2020-06-03T10:19:50+05:30 IST

గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విశాఖపట్నం జిల్లా ..

నేడు వైద్య ఆరోగ్యశాఖపై మంత్రి సమీక్ష

పార్వతీపురం, జూన్‌ 2: గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విశాఖపట్నం జిల్లా పాడేరులో బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు జేసీ (అభివృద్ధి), ఐటీడీఏ పీవో (ఎఫ్‌ఏసీ) బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ మహేశ్‌కుమార్‌ పార్వతీపురం ఐటీడీఏ నుంచి వెళుతున్నారు. ఈసమావేశంలో గిరిజన ప్రాంతాలకు చెందిన వైద్యశాఖల సేవలతో పాటు మలేరియా వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి సమీక్షించనున్నారు.


గిరిజన ప్రాంతాల్లో మలేరియా వ్యాధి నివారణతో పాటు ప్రస్తుతం కోవిడ్‌-19 సోకకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి సమీక్షించనున్నారు. 


ఈ సమీక్షలో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో భద్రగిరి, కురుపాం, సాలూరు సీహెచ్‌సీలకు సంబంధించి అప్‌గ్రేడింగ్‌పై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించి అప్‌గ్రేడింగ్‌కు సంబంధించిన పనులు వేగవంతంగా ప్రారంభిస్తే ఎంతో మేలు. పార్వతీపురం ఏరియా ఆసుపత్రి అప్‌గ్రేడింగ్‌ పనులు వేగవంతంగా ప్రారంభించే విధంగా తీసుకోవలసిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తే ఈ ప్రాంత గిరిజనులకు మేలు జరుగుతుంది.

Updated Date - 2020-06-03T10:19:50+05:30 IST