పంట నష్టం అంచనాలు కచ్చితంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-12-04T05:53:02+05:30 IST

నివర్‌తుపాను కారణంగా జరిగిన పంట నష్టం అంచనాలను కచ్చితంగా సేకరించాలని మంత్రులు కన్నబాబు, కొడాలి నాని ఆదేశించారు.

పంట నష్టం అంచనాలు కచ్చితంగా ఉండాలి

సెట్‌ కాన్ఫరెన్స్‌లో మంత్రులు కొడాలి, కన్నబాబు ఆదేశాలు

గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నివర్‌తుపాను కారణంగా జరిగిన పంట నష్టం అంచనాలను కచ్చితంగా సేకరించాలని  మంత్రులు కన్నబాబు, కొడాలి నాని ఆదేశించారు. గురువారం మంత్రులు సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించగా గుంటూరు కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, జేసీ దినేష్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ డెల్టాలో దెబ్బ తిన్న వరి అంచనాలను వేగవంతం చేయాలన్నారు. రంగుమారిన ధాన్యం కొనుగోళ్ళను ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ విజయభారతి, ఉద్యాన శాఖ డీడీ సుజాత, సివిల్‌ సప్లయిస్‌ డీఎం జయంతి తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2020-12-04T05:53:02+05:30 IST