ఇద్దరు వ్యక్తులతో సహా రూ.50 లక్షలు మిస్సింగ్‌

ABN , First Publish Date - 2021-04-19T06:11:14+05:30 IST

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్‌ గ్రామానికి చెందిన చిప్పరాజేశం, ఉడుత మల్లయ్యల ఆచూకీ లభించడం లేదు.

ఇద్దరు వ్యక్తులతో సహా రూ.50 లక్షలు మిస్సింగ్‌
చిప్పరాజేషం, ఉడుత మల్లయ్య

- సమీప బంధువుల కిడ్నాప్‌గా గ్రామస్థుల గుసగుసలు 

- భూపాలపల్లి జిల్లా కాన్‌సాయిపేట్‌ సమీపంలో ద్విచక్రవాహనం లభ్యం

- రామగిరి పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు

రామగిరి ఏప్రిల్‌ 18: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్‌ గ్రామానికి చెందిన చిప్పరాజేశం, ఉడుత మల్లయ్యల ఆచూకీ లభించడం లేదు. భూపాలపల్లి జిల్లా కాటారం సమీపంలోని గంగారం క్రాస్‌రోడ్‌ సమీపంలో కొంతకాలం క్రితం భూమి కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్‌ నిమిత్తం శనివారం లద్నాపూర్‌ గ్రా మానికి చెందిన చిప్పరాజేశం, ఉడుత మల్లయ్యలు ద్విచక్ర వాహనం (ఏపీ15 ఎస్‌9767)పై రూ.50లక్షల నగదుతో మధ్యాహ్నం ఇంటినుంచి కాటారం బయలు దేరి వెళ్ళారు. రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసుకొని రాత్రి ఇంటికి తిరిగి రావాల్సిన ఇద్దరు రాలేదు. దీంతో ఇద్దరి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై గాలింపు చేపట్టారు. భూపాలపల్లి జిల్లా కాన్‌సాయిపేట్‌ సమీపంలో రోడ్డుపై వీరు తీసికెళ్లిన ద్విచక్ర వాహనం దొరికింది. ద్విచక్ర వాహనానికి హ్యాండిల్‌ లాక్‌వేసి కిందపడేసి ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు చిప్ప రాజేశం భార్య పుష్పలత  ఆదివారంరామగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

ఇటీవలే పరిష్కారమైన భూవివాదం..

లద్నాపూర్‌ గ్రామానికి చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్యలు ఇద్దరు గ్రామానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూపాలపల్లి జిల్లా కాటారం సమీపం లోని 26 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. 2014-15లో ఎకరానికి రెండున్నర లక్షలకు చొప్పున చెరో 13 ఎకరాలకు కొనుగోలు పత్రం రాసుకున్నారు. మధ్యలో జిల్లా విభజన చోటుచేసుకోవడంతో సదరు భూమికి ధర పెరిగింది. రాజేశం, మల్ల య్యలు అనుకున్న సమయానికి మిగతా నగదు చెల్లించకపోవడంతో భూయజ మాని సదరు భూమిని మరి కొందరికి అమ్మినట్లు తెలిసింది. దీంతో అప్పటినుంచి ఇరువర్గాల మధ్య పంచాయితీలు జరిగినట్లు సమాచారం. ఇటీవల పెద్దమనుషుల జోక్యంతో అదే భూమి ఎకరానికి రూ.9లక్షల చొప్పున చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో శనివారం రాజేశ్‌, మల్లయ్యలు సదరు భూమి రిజిస్ట్రేష న్‌ కోసం రూ.50లక్షల నగదును చెల్లించేందుకు వెళ్ళి అదృశ్యమయ్యారు. వీరి అదృ శ్యం వెనుక సమీప బంధువుల హస్తం ఉండి ఉంటుందని చర్చించుకుంటున్నారు. పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్తున్న విషయం సమీప బంధువులకు, కుటుంబ సభ్యులకు మినహా ఎవరికీ తెలిసే అవకాశం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాధితుడి భార్య పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు.

Updated Date - 2021-04-19T06:11:14+05:30 IST