గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం

ABN , First Publish Date - 2021-10-18T06:19:21+05:30 IST

తాళ్లూరు పంచాయతీలో గ్రామకార్యదర్శి నిధులు దుర్వినియోగం చేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం
కార్యదర్శి తండ్రి బ్యాంకు ఖాతాకు పారిశుధ్య కార్మికుల వేతనం

నిబంధనలకు విరుద్దమంటున్న అధికారులు

తాళ్లూరు, అక్టోబరు 17 : తాళ్లూరు పంచాయతీలో గ్రామకార్యదర్శి  నిధులు దుర్వినియోగం చేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పంచా యతీ పారిశుధ్య పనుల్లో భాగంగా చేపట్టిన పనులకుగాను పారిశుధ్య కార్మికులకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ నిధుల నుం చినగదు డ్రాచేసి చెల్లింపులు చేశారు. నగదు చెల్లింపులో కూలీమేస్త్రీకి బదులుగా గ్రామకార్యదర్శి ఎన్‌.ప్రసన్నకుమార్‌ తన తండ్రి ఎన్‌ సువర్ణరాజ్‌ (విశ్రాంత ఉద్యోగి) ఖాతాకు జమచేశారు. ఇలా 2020 ఫిబ్రవరి  5,  రూ95564లు, మే 7న రూ35,875లు, మే 21, రూ64,600లు, జూన్‌ 23న రూ 1,83,696లు జమచేశారు. గ్రామకార్యదర్శి తండ్రి బ్యాంక్‌ అకౌంట్‌కు రూ3,79,735లు జమచేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ని బంధనల ప్రకారం అధికారి బంధువుల పేరుతో నగదు డ్రా చేయకూడదు. పారిశుధ్య పనులకు లక్షలు వెచ్చించి పనులు చేయక పోయినా జరిగినట్లు  తప్పుడు బిల్లులు సృష్టించి నిధులు దుర్వినియోగం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ తంతులో భాగంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కూడా ఫేక్‌ ఎం-బుక్‌లు నమోదు చేశారన్న ఆరోపణలు న్నాయి. ఈ విషయమై తాళ్లూరు గ్రామానికి చెందిన కోనేటి వెంకట్రావు  అనే వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాధు చేయగా విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. 

బంధువులపేర నిధులు డ్రా చేయరాదు

ఈ విషయాపై కందుకూరు డీఎల్‌పీవో భాస్కరరెడ్డి స్పందించారు. గ్రామపంచాయతీలలో చేపడుతున్న పనుల తాలుకూ నిధుల చెల్లింపుల్లో  ఉద్యోగులు తమ బంధువుల అకౌంట్లకు జమచేయరాదన్నారు. అలా నిధులు చెల్లింపులు జరిగినట్లు తమకు ఫిర్యాదు అందితే విచారణ జరిపి తగుచర్యలు తీసుకుంటామన్నారు.

డీఎల్‌పీవో భాస్కరరెడ్డి కందుకూరు 

Updated Date - 2021-10-18T06:19:21+05:30 IST