టిక్‌టాక్‌కు పోటీగా మేడిన్ ఇండియా మిత్రో.. దుమ్మురేపుతున్న యాప్
ABN , First Publish Date - 2020-05-28T19:57:06+05:30 IST
న్యూఢిల్లీ: టిక్‌టాక్ వీడియో యాప్‌కు ప్రత్యామ్నాయంగా మేడిన్ ఇండియా మిత్రో యాప్ పాపులారిటీ పొందుతోంది.
న్యూఢిల్లీ: టిక్‌టాక్ వీడియో యాప్‌కు ప్రత్యామ్నాయంగా మేడిన్ ఇండియా మిత్రో యాప్ పాపులారిటీ పొందుతోంది. ఇప్పటికే 50 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమయ్యే ఈ యాప్‌కు ప్రస్తుతం 4.7 రేటింగ్ ఉంది. ఐఐటీ రూర్కీ విద్యార్ధి శివాంక్ అగర్వాల్ ఈ యాప్‌ను రూపొందించాడు.
కరోనా వైరస్‌తో పాటు సరిహద్దు వద్ద చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో భారత్‌లో డ్రాగన్ దేశంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అందుకే చైనా తయారీ వస్తువులు, చైనా టెక్నాలజీ, చైనా యాప్‌ల వాడకాన్ని భారతీయులు క్రమంగా తగ్గిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చైనాపై వ్యతిరేకత పెరుగుతోంది. అందుకేనేమో టిక్‌టాక్ యాప్‌పై దీని ప్రభావం పడినట్లుంది. బ్యాన్ టిక్ టాక్ అనే హ్యాష్‌టాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీని ప్రభావంతో ప్లే స్టోర్‌లో టిక్‌టాక్ టాప్ ర్యాంకింగ్ నుంచి పడిపోయింది. ప్రస్తుతం దీని రేటింగ్ 1.4కు దిగజారిపోయింది. యాంటీ చైనా సెంటిమెంట్ టిక్‌టాక్ కొంపముంచింది.
ఇదే సమయంలో మిత్రో యాప్‌కు టాప్ రేటింగ్ 4.7 వచ్చింది. డౌన్‌లోడ్‌లు కూడా 5 మిలియన్లను దాటాయి. అత్యంత వేగంగా ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందిన యాప్‌గా మిత్రోకు పేరొచ్చింది.
టిక్‌టాక్ తరహాలో మిత్రోలో కూడా అన్ని తరహాలో టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫిల్టర్లు కూడా ఉన్నాయి. యూజర్లు చాలా సులభంగా వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు. షేర్ చేయవచ్చు. క్షణాల్లో వీడియో తీసుకుని ఏ మ్యూజిక్ క్లిప్ కానీ మూవీ డైలాగ్‌కానీ సింక్ చేసుకోవచ్చు. మిత్రో యాప్‌కు మల్టీ మీడియా కంటెంట్ కొదువే లేదు.
ప్రస్తుతానికి మిత్రో యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే గూగుల్ ప్లే స్టోర్‌లోఅందుబాటులో ఉంది. 8 ఎంబీ కన్నా తక్కువ సైజులో ఉండటం వల్ల స్మార్ట్‌ఫోన్లలో తక్కువ స్పేస్ సరిపోతుంది. త్వరలోనే యాపిల్ స్టోర్లలోనూ ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా మేడిన్ ఇండియా మిత్రో సిద్ధంగా ఉంది. మరెందుకు ఆలస్యం వెంటనే డౌన్‌లోడ్ చేసి యూజ్ చేయండి మరి.