ఘనంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు పుట్టినరోజు వేడుకలు

ABN , First Publish Date - 2021-08-02T05:45:21+05:30 IST

ఎమ్మెల్యే అన్నా రాంబాబు పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిరుమలలో కుటుంబసభ్యుల మధ్య పుట్టిన రోజును జరుపుకున్నారు.

ఘనంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు పుట్టినరోజు వేడుకలు


గిద్దలూరు టౌన్‌, ఆగస్టు 1 : ఎమ్మెల్యే అన్నా రాంబాబు పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిరుమలలో కుటుంబసభ్యుల మధ్య పుట్టిన రోజును జరుపుకున్నారు. పలువురు నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గిద్దలూరు పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో అన్నా రాంబాబు పుట్టిన రోజు వేడుకలను నగర పంచాయతీ పాలకవర్గం,  వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్‌ను మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య కట్‌ చేశారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్లు ఆర్‌డీ రామకృష్ణ, దీపిక, మున్సిపల్‌ కమిషనర్‌ రామకృష్ణయ్య, పాతాళ నాగేశ్వరస్వామి దేవస్థాన మాజీ చైర్మన్‌ ఆంజనేయులు, శివపురం హరీష్‌, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. కొత్తపల్లి గ్రామంలో  వైస్‌చైర్మన్‌ కాతా దీపిక ఆధ్వర్యంలో భారీ కేక్‌  కట్‌ చేశారు. నాయకులు కోటా నరసింహులు, కాతా రామచంద్రారెడ్డి, కరస్పాండెంట్‌ సూరె చెంచయ్య పాల్గొన్నారు. రాచర్ల రోడ్డులోని  పార్టీ కార్యాలయంలో  మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ సీహెచ్‌.రంగారెడ్డి కేక్‌ కట్‌ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ మస్తాన్‌వలి,  నాయకులు మత్తయ్య, గఫూర్‌, పీరయ్య రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచారు. దివ్యాంగుల పాఠశాలలో నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులను  దాసరి సంగీతరావు మిత్రమండలి సమకూర్చగా సీఐ ఎమ్‌డీ ఫిరోజ్‌ పంపిణీ చేశారు.  నాయకులు బొప్పూరి మత్తయ్య, కౌన్సిలర్‌ వినుకొండ మరియమ్మ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 

కంభంలో..

కంభం :  ఎమ్మెల్యే రాంబాబు పుట్టిన రోజు సందర్భంగా 120 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.  మాజీ జడ్పీటీసీ సయ్యద్‌ జాకీర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు చేగిరెడ్డి లింగారెడ్డి, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ నెమలిదిన్నె చెన్నారెడ్డి, మాజీ  ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాసులు, ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు, వాసవీ విద్యాసంస్థల చైర్మన్‌ గోళ్ల సుబ్బరత్నం, గొంగటి చెన్నారెడ్డి, కంభం సర్పంచ్‌ బోడయ్య, ఉపసర్పంచ్‌ సయ్యద్‌ ఖాశిం, హెచ్‌గూడెం సర్పంచ్‌ మహబూబ్‌ పాల్గొన్నారు. 

రాచర్లలో..

రాచర్ల : ఎమ్మెల్యే అన్నా రాంబాబు పుట్టిన రోజు అన్ని గ్రామాల్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో  నాయకులు సీఆర్‌ఐ మురళి, జడ్పీటీసీ పగడాల శ్రీరంగం, అన్నా రంజిత్‌కుమార్‌, ఓబులరెడ్డిపల్లె సూరా పాండురంగారెడ్డి, చినగానిపల్లి, అనంపల్లె సర్పంచ్‌లు పగడాల రమేష్‌, శిరిగిరి రమేష్‌ పాల్గొన్నారు. 

బేస్తవారపేటలో..

బేస్తవారపేట : స్థానిక పార్టీ కార్యాలయంలో పూనూరు భూపాల్‌రెడ్డి,బొల్లాబాలిరెడ్డి, మట్టా రమేష్‌, టీవీఎస్‌ శర్మ,  మిట్టా సంజీవరెడ్డి, ఈశ్వరరెడ్డి కేక్‌ కట్‌ చేసి ఎమ్మెల్యే రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

కొమరోలులో..

కొమరోల :  దద్దవాడ గ్రామ పంచాయతీలో అన్నా రాంబాబు పుట్టిన రోజు సందర్భంగా కేస్‌ కట్‌ చేశారు. గ్రామ కార్యదర్శి ఎల్లాల సుబ్బారావు  పేదలకు దుపట్లును పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భూమా రమణమ్మ, నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-02T05:45:21+05:30 IST