టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-27T06:58:13+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ బుధవారం అన్ని జిల్లాల అధ్యక్షులను ప్రకటించారు. వీరి ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పజెప్పారు.

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

సంబురాలు జరుపుకొన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్న ఎమ్మెల్యే

నిజామాబాద్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ బుధవారం అన్ని జిల్లాల అధ్యక్షులను ప్రకటించారు. వీరి ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పజెప్పారు. ఆర్మూర్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవన్‌రెడ్డి అసెంబ్లీతో పాటు ఇతర వేదికల్లో పార్టీ తరఫున దూకుడుగా పాల్గొంటున్నారు. పార్టీ ఉద్యమకాలంలో పనిచేసిన ఆయన ఆర్మూర్‌ వేదికగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ తరఫున రెండో దఫా ఎన్నికై శాసన సభ్యునిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ పబ్లిక్‌ అండర్‌టేకింగ్‌ కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. మరో రెండేళ్లలోపే ఎన్నికలు ఉండడంతో పార్టీ కార్యకలాపాలను విస్తృతపరిచేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్‌ అన్ని జిల్లాలకు ఎమ్మెల్యేలు, ఎంపీలను అధ్యక్షులుగా అవకాశం కల్పించారు. ఎక్కువగా యువకులకు పెద్దపీట వేశారు. జిల్లాలో కీలకంగా వ్యవహరించాల్సి ఉండడంతో ఆయనను నియమించినట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ కార్యక్రమాలు పెరుగుతున్న సమయంలో ఆయనను జిల్లా అధ్యక్షునిగా నియమించారు.  జిల్లా అధ్యక్షునిగా ఆయనను నియమించడంపట్ల పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్‌ స్వతహాగా ఈసారి ఎమ్మెల్యేలు, ఎంపీలకు అవకాశం కల్పించడం వల్ల ఇప్పటి వరకు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్‌ నేతలకు ఇతర పదవులు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తనను నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షిడిగా నియమించిన సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వస్తానని, జిల్లాలో పార్టీని మరింత బలోపేతనాకి కృషి చేస్తానని జీవన్‌రెడ్డి అన్నారు.

 ఆర్మూర్‌లో సంబరాలు..

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలోని అంబేద్కర్‌చౌరస్తాలో బుధవారం టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డిని  టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ శేక్‌మున్న, టీఆర్‌ఎస్‌ పట్ణణ అధ్యక్షుడు పూజ నరేందర్‌, కౌన్సిలర్‌ గంగామోహన్‌చక్రు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T06:58:13+05:30 IST