ఎమ్మెల్యే పెద్దారెడ్డీ.. గుణపాఠం తప్పదు..!

ABN , First Publish Date - 2021-07-29T06:30:00+05:30 IST

‘ ఎమ్మెల్యే పెద్దారెడ్డీ.. నీ అరాచక పాలనను ప్రజలు అప్పుడే చీదరించుకుంటున్నారు. తాడిపత్రిలో ఆక్రమణల పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నావ్‌. నీవు అధికారం చేపట్టిన 16 నెలలకు నిర్వహిం చిన మున్సిపల్‌ ఎన్నికల్లోనే ప్రజలు నీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. అప్పుడు నాపై, నా కుమారుడు జేసీ అశ్మిత్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిం చారు. లేకుంటే.. అన్ని స్థానాల్లో టీడీపీనే గెలిచేది..’ అని మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే పెద్దారెడ్డీ.. గుణపాఠం తప్పదు..!
మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి


నీ పాలనపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత

జగన్‌ను చూసి వేసిన ఓట్లతో నీవు గెలిచావ్‌

నీ భార్య మామూళ్ల పేరుతో రచ్చకెక్కింది

మున్సిపల్‌ ఎన్నికల సమయంలో మమ్మల్ని జైల్లో పెట్టారు

లేకుంటే.. అన్ని స్థానాల్లో  టీడీపీనే గెలిచేది

సోషల్‌ మీడియాలో వైరల్‌  అయిన జేసీపీ వీడియో


తాడిపత్రి, జూలై 28 : ‘ ఎమ్మెల్యే పెద్దారెడ్డీ.. నీ అరాచక పాలనను ప్రజలు అప్పుడే చీదరించుకుంటున్నారు. తాడిపత్రిలో ఆక్రమణల పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నావ్‌. నీవు అధికారం చేపట్టిన 16 నెలలకు నిర్వహిం చిన మున్సిపల్‌ ఎన్నికల్లోనే ప్రజలు నీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. అప్పుడు నాపై, నా కుమారుడు జేసీ అశ్మిత్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిం చారు. లేకుంటే.. అన్ని స్థానాల్లో టీడీపీనే గెలిచేది..’ అని మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆయన సోషల్‌ మీడియాలో బుధవారం అప్‌లోడ్‌ చేసిన వీడియో హల్‌చల్‌ చేస్తోంది. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో 75 మున్సిపాలిటీల్లో 74 మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంటే... ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రం టీడీపీ వశం కావడాన్ని బట్టి చూస్తే ప్రజలు నిన్ను ఎంతగా చీదరించుకుంటున్నారో అర్థం అవుతుంది. ఈ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన వారు ఎమ్మెల్యేలుగా గెలుపొందినా.. వారి భార్యలు, కు టుంబ సభ్యులు ఎప్పుడూ రచ్చకెక్కలేదు. కేవలం వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్య మామూళ్లువసూళ్లు చేస్తూ రచ్చకెక్కింది. 2019  అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం జగన్‌మోహన్‌రెడ్డిని చూసి ఓట్లు వేశారే తప్ప.. నిన్ను చూసి కాదనే విషయాన్ని గ్రహించు. కొందరికి ఇళ్లపట్టాలు ఇవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు... పీర్లమాన్యం, ఆంజనేయస్వామి మాన్యాల్లో ఉన్నవారికి పట్టాలు ఇవ్వాలి. లేకుంటే ఉద్యమిస్తాం.  కార్యకర్తలను విమర్శించడం పద్ధతి కాదు. వారు లేకుంటే నీకే కాదు.. నాకూ  మనుగడ ఉండదు. నీతో పాటు నీ సోదరుడు కూడా నా వర్గం నుంచి వెళ్లిపోయిన వారేనని మర్చిపోకు..’ అని హితవు చెప్పాడు.


Updated Date - 2021-07-29T06:30:00+05:30 IST