అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి

ABN , First Publish Date - 2020-02-28T11:25:17+05:30 IST

నారాయణపేట జిల్లా కేంద్రంలోని 7, 8 వార్డుల్లో కలెక్టర్‌ హరిచందన, ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి గురువారం పట్టణ ప్రగతి లో భాగంగా పర్యటించారు.

అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి

రోడ్లపై చెత్తవేస్తే జరిమానా విదించాలి

కలెక్టర్‌ హరిచందన

ప్రగతి కనిపించడం లేదు

విస్మయం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎస్‌.ఆర్‌.రెడ్డి


నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 27 : నారాయణపేట జిల్లా కేంద్రంలోని 7, 8 వార్డుల్లో కలెక్టర్‌ హరిచందన, ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి గురువారం పట్టణ ప్రగతి లో భాగంగా పర్యటించారు. వార్డులో ఎక్కడప డితే అక్కడ చెత్తవేయడం చూసి వారు ముని సిపల్‌ అధికారులపై మండిపడ్డారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, ప్రజలు ఎక్కడప డితే అక్కడ చెత్త వేస్తే జరిమానా విధించాలని మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. వార్డుల్లో డ్రెయినే జీలు నిండి మురుగునీరు రోడ్డుపైకి వస్తుండడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకోకుండా మునిసిపల్‌ అధికారులు ఏం చేస్తున్నారని కలెక్టర్‌ ప్రశ్నించారు. వార్డు కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు కలిసి వార్డును అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. వార్డు అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు.


ప్రగతి కనిపించడం లేదు : ఎమ్మెల్యే

పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టి నాలు గు రోజులు గడుస్తున్నా అభివృద్ధి కనిపించడం లేదని ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి అధికారుల తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలను సైతం భాగస్వాము లను చేయాలన్నారు. వార్డులను ఆయా వార్డుల కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు, ప్రజలు అభివృద్ధికి సహకరిస్తే తమవంతు సహాయం చేస్తామన్నారు. అక్రమ కట్టడాలు ఉంటే అధికారులు కూల్చివేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. వార్డులో కంపచెట్లు ఉండడం పట్ల ఎమ్మెల్యే మునిసిపల్‌ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, కౌన్సిలర్‌ మహ్మద్‌ సలీం, శిరీష, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ చెన్నారెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌, ప్రత్యేక అధికారి జైపాల్‌రెడ్డి, ఇంజనీర్‌ ఖాజాహుస్సేన్‌ పాల్గొన్నారు.


ఏమ్మా..సంతకం వస్తదా ? కలెక్టర్‌

పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం పేటలోని 8వ వార్డులో కలెక్టర్‌ హరిచం దన పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ఆర్‌పీలతో మాట్లాడు తూ నిరక్షరాస్యత సర్వే నిర్వహించారా అని ఆర్‌పీ జ్యోతిని ప్రశ్నించారు. దానికి ఆమె సర్వే పూర్తిచేసినట్లు సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడే ఉన్న ఓ మహిళకు కలెక్టర్‌ ఏమ్మా నీకు సంతకం చేయడానికి వస్తుందా అని ప్రశ్నించగా,  సదరు మహిళ సంతకం చేసి చూపడంతో కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అదే వార్డులో ఓ ఇంటికి వెళ్లి మీ ఇంట్లో చెత్త బుట్టలు ఉన్నాయా అని అడగగా, ఆ ఇంటి మహిళ ఒకే చెత్త బుట్టను చూపింది. మరోటి ఎక్కడ అని అడగగా మా ఓనర్‌ ఒక్కటే ఇచ్చాడని సమాధానం ఇచ్చింది. ఇంటి యజమానులకే ఇస్తున్నారు మేడం, అద్దెకు ఉన్న వాళ్లకు చెత్తబుట్టలు ఇవ్వడం లేదని ఆ మహిళ కలెక్టర్‌కు తెలిపారు. 

Updated Date - 2020-02-28T11:25:17+05:30 IST