అమరావతి: ఏపీలో శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న కీలక సమయంలో ‘మా’ ఎమ్మెల్యే కనపడటం లేదంటూ దళిత రైతు వినూత్న నిరసన చేపట్టాడు. రాజధాని ప్రాంతం తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనపడుట లేదంటూ ఉద్దండరాయని పాలెం దళిత రైతు పులి చిన్న ఫొటో ప్రదర్శన చేశాడు. తమ ఎమ్మెల్యే ఎక్కడకు వెళ్లారు.. ఏమయ్యారు అంటూ ఫొటోతో అన్వేషణ చేపట్టాడు. రాజధాని రైతుల సమస్యలు, దళిత అసైన్డ్ రైతులకు వార్షిక కౌలు పడలేదనే విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశాడు.