ఎమ్మెల్యే విష్ణు క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2021-09-29T04:53:48+05:30 IST

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ వెంకటేశ్వరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెంటనే క్షమాపణ చెప్పాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే విష్ణు క్షమాపణ చెప్పాలి
నిరనస తెలియచేస్తున్న యూటీఎఫ్‌ నేతలు

యూటీఎఫ్‌ ఆందోళన

నెల్లూరు (విద్య), సెప్టెంబరు 28 : పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ వెంకటేశ్వరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెంటనే క్షమాపణ చెప్పాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. నగరంలోని అన్నమయ్య సర్కిల్‌ వద్ద యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బాబురెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్సీతో విష్ణు అహంకార పూరితంగా మాట్లాడడం అన్యాయమన్నా రు. ఇందుకు ఆయన క్షమాపణ చెప్పడమేకాక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు తులసీరాం బాబు, ప్రధాన కార్యదర్శి శేషులు,  రాష్ట్ర కౌన్సిలర్‌ నవకోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షు డు ఎంసీ అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-29T04:53:48+05:30 IST