వరద బాధితులను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2021-07-30T04:45:30+05:30 IST

ఇటీవల గోదావరి వరదలో చిక్కుకున్న గ్రామా లను పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గురువారం సందర్శించారు.

వరద బాధితులను ఆదుకుంటాం
వరద బాధితులకు టార్పాలిన్‌ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

వేలేరుపాడు, జూలై 29: ఇటీవల గోదావరి వరదలో చిక్కుకున్న గ్రామా లను పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గురువారం సందర్శించారు. నాళ్ల వరం, కటుకూరు, టేకూరు, కొయిదా గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వరద భాధితులను పరామర్శించారు. అనూహ్య వరదలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, భవిష్యత్‌లో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మరికొద్ది రోజుల్లో కొయిదా, మరో రెండు గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లిస్తామన్నారు. మిగిలిన గ్రామా లకు కూడా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చిన తరువాతే తరలించే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. సంతృప్తికరంగానే నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. కొయిదాలో తాత్కాలిక గుడిసెలు వేసుకున్న కుటుంబాలకు టార్పాలిన్లు పంపిణీ చేశారు.


సచివాలయ ఉద్యోగులపై ఆగ్రహం


వరద ముంపు ప్రాంతాలతో పాటు గ్రామ సచివాలయాలను ఎమ్మెల్యే సందర్శించారు. నాళ్లవరం, కటుకూరు, కొయిదా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు గైర్హాజరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరు అయినవారికి నోటీసులు ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్‌ చెల్లన్నదొర, ఎంపీడీవో శ్రీహరి, వైసీపీ నాయకులు కేశగాని శ్రీనివాసరావు, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T04:45:30+05:30 IST