అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-12-03T04:09:37+05:30 IST

చెన్నూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ గురువారం పరిశీలించారు. రూ. 3.53 కోట్లతో 6.44 ఎకరాల్లో నిర్మిస్తున్న మినీ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలిం చి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రూ.15 కోట్లతో నిర్మిస్తున్న ప్రధాన రహదారి, సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లు, జంక్షన్‌ల ఏర్పాటు పనులను పరిశీలించారు.

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
అధికారులకు సూచనలు ఇస్తున్న ఎమ్మెల్యే సుమన్‌

చెన్నూరు, డిసెంబరు 2: చెన్నూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులను  ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ గురువారం పరిశీలించారు. రూ. 3.53 కోట్లతో 6.44 ఎకరాల్లో నిర్మిస్తున్న మినీ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలిం చి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రూ.15 కోట్లతో నిర్మిస్తున్న ప్రధాన రహదారి, సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లు, జంక్షన్‌ల ఏర్పాటు పనులను పరిశీలించారు. అలాగే ఓపెన్‌ జిమ్‌ పనులను పరిశీలించారు. మిషన్‌ భగీరథ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్‌ భగీరథ పైపు లైన్‌ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిం దన్నారు. పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.  

టీఎన్‌జీవోస్‌ భవనానికి స్థలం కేటాయించాలి

చెన్నూరు పట్టణంలో టీఎన్‌జీవోస్‌ భవన నిర్మాణానికి స్థలం కేటాయించా లని టీఎన్‌జీవోస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, అటవీ శాఖ రాష్ట్ర ఫోరం అధ్యక్షుడు పొన్న మల్లయ్య ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌కు విన్నవించారు.  గురువారం అటవీ శాఖ క్యాంపు కార్యాలయానికి వచ్చిన విప్‌నకు స్థలం కేటాయించడంతో పాటు నిధులను మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనిట్‌ అధ్యక్షుడు రాజన్న, కార్యదర్శి అభిషేక్‌, ఉద్యోగులు కరీం, నసీర్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T04:09:37+05:30 IST