మంత్రి కొడాలిపై ఎమ్మెల్సీ ఫైర్‌

ABN , First Publish Date - 2020-04-02T09:25:29+05:30 IST

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి కొడాలిపై ఎమ్మెల్సీ ఫైర్‌

అనకాపల్లి, ఏప్రిల్‌ 1: పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు బుధవారం  ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే సన్నబియ్యం ఇస్తామని, వలంటీర్లతో ఇంటికే రేషన్‌ సరఫరా చేస్తామని తప్పుడు హామీలు ఇచ్చింది ఎవరో గుర్తు చేసుకోవాలన్నారు. పాలన చేతకాకపోతే చంద్రబాబును చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. పెద్దరికానికి గౌరవం ఇచ్చి మసులుకోవాలని, నోరుపారేసుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. 

Updated Date - 2020-04-02T09:25:29+05:30 IST