Advertisement
Advertisement
Abn logo
Advertisement

వడుకాపూర్‌లో మొబైల్‌ సైన్స్‌ల్యాబ్‌

జూలపల్లి, నవంబర్‌ 27 : మండలంలోని వడుకాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం మొబైల్‌ సైన్స్‌ల్యాబ్‌ సమావేశాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా 6, 10వ తరగతి విద్యార్థులకు మొబైల్‌ సైన్స్‌ల్యాబ్‌ ద్వారా గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రాలకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పాఠశాల తరగతులకు దూరమైన విద్యార్థుల అభ్యాసన స్థాయిలను మెరుగుపరిచేందుకు మొబైల్‌ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొబైల్‌ సైన్స్‌ ల్యాబ్‌ కన్వీనర్‌ ఎంఏ షేక్‌, జిల్లా సైన్స్‌ అధికారి రవిందర్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ మొదుంపల్లి స్వామి, రిసోర్స్‌పర్సన్స్‌ ప్రభాకర్‌, కోదండపాని, వేణుగోపాల్‌రెడ్డి, శివప్ర సాద్‌, నాగభూషణం, రాములు, లక్ష్మీపతి, రఘునందన్‌, సురెందర్‌ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement