మోడల్‌ ఆసుపత్రి ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-22T06:47:57+05:30 IST

జిల్లా కేంద్రంలోని వీర సావర్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వంద పడకల మోడల్‌ ఆస్పత్రిని ఐటీ శాఖ ప్రిన్సి పల్‌ సెక్రటరి జయేష్‌ రంజన్‌, ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ హరిచందన, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పుర చైర్మన్‌ గందె అనసూయ, వెల్ప్‌ ఫార్గో ప్రతినిధి శ్రీధర్‌ చండూరి, యునిటైడ్‌ వే బెంగుళూరు ప్రతినిధి రాజేష్‌ కృష్ణన్‌ తో కలిసి గురువారం ప్రారంభించారు.

మోడల్‌ ఆసుపత్రి ప్రారంభం
మోడల్‌ ఆసుపత్రిని ప్రారంభిస్తున్న ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి

పాల్గొన్న ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి జయేష్‌ రంజన్‌, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి, కలెక్టర్‌ హరిచందన, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి

నారాయణపేట టౌన్‌, అక్టోబరు 21 : జిల్లా కేంద్రంలోని వీర సావర్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వంద పడకల మోడల్‌ ఆస్పత్రిని ఐటీ శాఖ ప్రిన్సి పల్‌ సెక్రటరి జయేష్‌ రంజన్‌, ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ హరిచందన, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పుర చైర్మన్‌ గందె అనసూయ, వెల్ప్‌ ఫార్గో ప్రతినిధి శ్రీధర్‌ చండూరి, యునిటైడ్‌ వే బెంగుళూరు ప్రతినిధి రాజేష్‌ కృష్ణన్‌ తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ స్పాన్సర్స్‌ వెల్స్‌ ఫార్గో, ఇంప్లిమెంటెడ్‌ బై ఎంమోడలస్‌, సీఎస్‌ఆర్‌ పాట్నర్‌గా యునిటైడ్‌ వే బెంగుళూర్‌ ఉమ్మడి సహకారంతో రూ.రూ.4.20 కోట్ల వ్యయంతో వంద రోజుల్లో వంద పడకల చిన్న పిల్లల ఆసుపత్రిని ఏర్పాటు చేయడంపై వారికి కృతజ్ఞతలు తెలిపారు. జూలై 11న ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ నారాయణపేట జిల్లా సందర్శన సందర్భంగా కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను అరికట్టేందుకు ప్రణాళికలు చేసుకోవడం జరిగిందన్నారు. అనుకున్నదే తడవుగా కలెక్టర్‌ హరిచందన చొరవ తీసుకొని ప్రిన్సిపల్‌ సెక్రెటరి జయేష్‌ రంజన్‌తో మాట్లడంతో అందుకు కలెక్టర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇప్పటికే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పిడియాట్రిక్‌ వైద్యులు ఉన్నారని అదనంగా మరో ఇద్దరు వైద్యులను, సరిపడ నర్సింగ్‌, పారా మెడికల్‌ సిబ్బందిని నియమించి వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని ప్రిన్సిపల్‌ సెక్రెటరిని కోరారు. కలెక్టర్‌ హరిచందన మాట్లాడుతూ థర్డ్‌ వేవ్‌లో చిన్న పిల్లలకు కొవిడ్‌ వస్తే ఎలా తట్టుకోవాలి ఎటువంటి ఏర్పాట్లు అవసరమనే విషయాలపై ఎమ్మెల్యేలతో చర్చించి వంద పడకల చిన్న పిల్లల ఆసుపత్రి సిద్ధం చేశామన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌కు దూరంగా కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ జిల్లాకు మోడల్‌ ఆసుపత్రి ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఎమ్మెల్యే, కలెక్టర్‌ చొరవతో రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా అన్నీ సదుపాయాలతో ఈ చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యునిటైడ్‌ వే బెంగుళూరు ప్రతినిధి రాజేష్‌ కృష్ణన్‌ మాట్లాడుతూ జిల్లా గ్రామీణ ప్రజలకు అన్నీ మౌలిక సదుపాయాలతో కూడిన ఆసుపత్రిని వెల్ప్‌ ఫార్గో, యునిటైడ్‌ వే బెంగుళూర ద్వారా నిర్మించి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఆసుపత్రి సూప రింటెండెంట్‌ మల్లికార్జున్‌, ఆర్డీవో వెంకటేశ్వర్లు, మోడల్‌ స్టార్టప్‌ సీఈవో శ్రీరామ్‌, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నాణ్యమైన చీరలను తయారు చేయాలి 

నారాయణపేట చీరలు అంటే దేశంలో చాలా ప్రాముఖ్యత ఉందని కార్మికులు నాణ్యమైన చీరలను తయారు చేయాలని రాష్ట్ర ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ధూల్‌పేట్‌, సిక్కిల్‌ గేరిలో చిత్రిక ఆర్టిసన్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ వారు నిర్వహిస్తున్న చేనేత శిక్షణ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. కార్మికుల్లో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ ఇప్పిస్తామని, టెక్స్‌ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. చీరలు కాకుండా ఇతరత్రా దుస్తువులను తయారు చేయాలన్నారు. 




Updated Date - 2021-10-22T06:47:57+05:30 IST