నిరాడంబరంగా రంజాన్‌

ABN , First Publish Date - 2021-05-15T05:52:42+05:30 IST

జిల్లాలో ముస్లింలు రంజాన్‌ను నిరాడంబరంగా జరు పుకున్నారు.

నిరాడంబరంగా రంజాన్‌
నారాయణపూర్‌లో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జిల్లాలో ముస్లింలు రంజాన్‌ను నిరాడంబరంగా జరు పుకున్నారు. కరోనా ప్రభావంతో  ఈద్గా, మసీదులకు వెళ్ల కుండా ప్రభుత్వ ఆదేశాలు, మత గురువుల సూచనల మేరకు ఇళ్లలోనే భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. కుటుంబ సభ్యులతో రంజాన్‌ వేడుకలను అనందంగా జరుపుకు న్నా రు. ఈ సందర్భంగా ముస్లింలకు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు సోషల్‌ మీడియా, ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 

ఇల్లంతకుంట: మండలంలోని పలు గ్రామాల్లో రంజాన్‌ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఏటా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపే ముస్లింలు  శుక్రవారం ఇళ్ల వద్ద ప్రార్థనలు చేశారు.  జడ్పీవైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ చింతపెల్లి వేణురావు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

ఎల్లారెడ్డిపేట:మండలంలో శుక్రవారం రంజాన్‌ వేడుకలను ముస్లింలు నిరాడంబరంగా జరుపుకున్నారు. మండల కేంద్రంతోపాటు నారాయణపూర్‌, బొప్పాపూర్‌, గొల్లపల్లి, వెంకటాపూర్‌, పదిర, హరిదాస్‌నగర్‌, బండలింగంపల్లి, తదితర గ్రామాల్లో లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  ఈ సందర్భంగా మసీదుల వద్ద  ఏఎస్సై కిషన్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.

 వీర్నపల్లి:  రంజాన్‌ సందర్భంగా  కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఇళ్ల వద్దనే ముస్లింలు ప్రార్థనలు చేశారు.   ముస్లిం నాయకులు జడ్సీ కో ఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ చాంద్‌పాషా, మాజీ ఏఎంసీ డైరెక్టర్‌ మహ్మద్‌ రఫీ పాల్గొన్నారు. రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు జడ్పీటీసీ గుగులోతు కళావతిసురేశ్‌నాయక్‌, ఎంిపీపీ మాలోతు బూలాసంతోష్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ బోడ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు

గంభీరావుపేట:  మండల కేంద్రంతోపాటు పలు గ్రామా ల్లో శుక్రవారం రంజాన్‌ను ముస్లింలు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జరుపుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

ముస్తాబాద్‌: ముస్తాబాద్‌ మండల కేంద్రంతోపాటు మొర్రాయిపల్లె, పోత్గల్‌, నామాపూర్‌, చీకోడ్‌ గ్రామాల్లో శుక్రవారం రంజాన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మం డల కో అప్షన్‌ మెంబర్‌ షాదుల్‌పాషా, జహంగీర్‌, సర్వర్‌ పాషా, మోయిన్‌పాషా, ముక్తర్‌, మున్నాఫ్‌ పాల్గొన్నారు. 

 వేములవాడలో..

వేములవాడ,: పవిత్ర రంజాన్‌ (ఈద్‌-ఉల్‌-ఫితర్‌) పర్వదినాన్ని ముస్లింలు శుక్రవారం వేములవాడలో నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా మహమ్మారి రెండో దశ   విజృంభిస్తున్న తరుణంలో వైరస్‌ నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతుండగా, ముస్లింలు ఇళ్లలో ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌ సుభాష్‌నగర్‌లో ముస్లింలను కలిసి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

 

Updated Date - 2021-05-15T05:52:42+05:30 IST