ప్రభుత్వాస్పత్రిలో ఆధునిక సదుపాయాలు

ABN , First Publish Date - 2020-12-05T05:06:18+05:30 IST

జిల్లాలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అత్యాధునిక వసతులను ఏర్పాటు చేసినట్లు జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తెలిపారు.

ప్రభుత్వాస్పత్రిలో ఆధునిక సదుపాయాలు
ఆస్పత్రిని పరిశీలిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

సిరిసిల్ల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అత్యాధునిక వసతులను ఏర్పాటు చేసినట్లు జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తెలిపారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 50 పడకల ప్రత్యేక ప్యాబ్రికేటేడ్‌ షెడ్డు, 6 వేల లీటర్ల సామర్థ్యంలో ప్రత్యేక లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌, అదనంగా ఏర్పాటు చేసిన ఐదు డయాలసిస్‌ యూనిట్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. తుది దశలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఆస్పత్రిలో 5 డయాలసిస్‌ యూనిట్లు ఉన్నాయని,  రూ.50 లక్షలతో మరో 5 యూనిట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  రూ.20 లక్షలతో డిజిటల్‌ ఎక్స్‌రే, రూ.5 లక్షలతో ల్యాబ్‌ పరికరాలు సమకూర్చామన్నారు. రూ.40 లక్షలతో కొవిడ్‌ పేషెంట్ల కోసం 50 పడకల ప్రత్యేక ప్యాబ్రికేటేడ్‌ షెడ్డును ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోం దన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా త్వరలో ప్రారం భోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.  ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రావు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-05T05:06:18+05:30 IST