లాక్‌డౌన్‌తో గ్రామాలపై కోతుల దండు దాడి

ABN , First Publish Date - 2020-04-08T14:17:02+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో పట్టణ ప్రాంతాల్లోని కోతులు (వానరాలు) గ్రామాలకు వస్తున్నాయి.....

లాక్‌డౌన్‌తో గ్రామాలపై కోతుల దండు దాడి

దాణా కేంద్రాలు పెట్టాలని వినతి

సిమ్లా (హిమాచల్ ప్రదేశ్): కరోనా లాక్‌డౌన్‌తో పట్టణ ప్రాంతాల్లోని కోతులు (వానరాలు) గ్రామాలకు తరలి వస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలైన పట్టణాల్లో  లాక్‌డౌన్‌ వల్ల ఆహారం దొరకక పోవడంతో కోతుల దండు గ్రామాలపై పడ్డాయి. గ్రామాల్లోని కూరగాయల తోటలపై కోతుల దాడితో పంటలు దెబ్బతింటున్నాయి. కోతుల బెడద వల్ల రైతులు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని హిమాచల్ ప్రదేశ్ కిసాన్ సభ  అధ్యక్షుడు చెప్పారు. కూరగాయల తోటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అధ్యక్షుడు కోరారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో కోతుల కోసం దాణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు సూచించారు. కోతుల దండు దాడితో హిమాచల్ ప్రదేశ్ గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-04-08T14:17:02+05:30 IST