దారి మళ్లిన రూ. 1.23 కోట్లు.. పని చేసే సిబ్బంది చేతివాటం..

ABN , First Publish Date - 2020-08-07T15:43:00+05:30 IST

ఏటీఎం సెంటర్లలో క్యాష్‌ డిపాజిట్లు చేసే సిబ్బంది చేతి వాటం ప్రదర్శించారు. ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు డిపాజిట్‌ చేయకుండా భారీగా ఆ డబ్బును దారి మళ్లించారు. సిబ్బంది వివిధ సందర్భాల్లో మొత్తం

దారి మళ్లిన రూ. 1.23 కోట్లు.. పని చేసే సిబ్బంది చేతివాటం..

ఆడిటింగ్‌లో వెలుగు చూసిన మోసం.. సీసీఎస్ లో ఫిర్యాదు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ఏటీఎం సెంటర్లలో క్యాష్‌ డిపాజిట్లు చేసే సిబ్బంది చేతి వాటం ప్రదర్శించారు. ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు డిపాజిట్‌ చేయకుండా భారీగా ఆ డబ్బును దారి మళ్లించారు. సిబ్బంది వివిధ సందర్భాల్లో మొత్తం రూ. 1.23కోట్ల రూపాయలు కాజేసినట్లు సెక్యూర్‌ వ్యాల్యూ ఇండియా ప్రైవేటు సంస్థ తమ ఫిర్యాదులో పేర్కొంది. సంస్థ నిర్వహించిన ఆడిటింగ్‌లో క్యాష్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌కు  సంబంధించిన అంశాలు బయట పడ్డాయి. దీంతో సంస్థ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస రావు జూలై 17న సీసీఎ్‌సలో ఫిర్యాదు చేశారు. వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం యంత్రాలలో డబ్బు డిపాజిట్‌ చేసే కాంట్రాక్ట్‌తో పాటు క్యాష్‌ మేనేజ్మెంట్‌ తదితర సర్వీసులను సెక్యూర్‌ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వహిస్తోంది. సర్వీసె్‌సలో భాగంగా కొన్ని బాధ్యతల నిర్వహణకు బీటీఐ పేమెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో ఒప్పందం కు దుర్చుకున్నారు. 36 ఏటీఎం సెంటర్లలో నగదు డిపాజిట్‌ చేసే పనిని బీటీఐ కి అప్పగించారు. ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్‌ చేసేందుకు కొంతమంది కస్టోడియన్లను నియమించి వారికి ఏటీఎం తాళాలు, పాస్‌వర్డులు అప్పగించారు. నలుగురు  సభ్యులున్న ఓ టీమ్‌ కస్టోడియన్లుగా ఉన్న రూట్‌ నుంచి రిపోర్టు రాకపోవడంతో కంపెనీ ప్రతినిధులు ఆడిటింగ్‌ నిర్వహించారు. ఈ ఆడిటింగ్‌లో  రూ. 1.23 కోట్ల నగదు దారి మళ్లినట్లు గుర్తించి ఫిర్యాదు చేశారు. సీసీఎస్‌ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2020-08-07T15:43:00+05:30 IST